twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తాప్పీ కౌంటర్.. దెబ్బకు నోరు మూత.. నెటిజన్ల ప్రశంసలు

    |

    హీరో, హీరోయిన్లు ఏదైనా ఈవెంట్‌లో పాల్గొన్న వారు మాట్లాడే భాషపై అభ్యంతరాలు వ్యక్తం అవుతుంటాయి. ప్రాంతీయ భాషలో మాట్లాడమంటూ కొన్నిసార్లు విన్నప రూపంలో వస్తే.. మరికొన్ని సార్లు సూచన పూర్వకంగా వస్తాయి. అయితే పాల్గొన్న వేడుకలు, స్టేజ్‌ను బట్టి వారి కంఫర్ట్ మేరకు హీరో, హీరోయిన్లు ఓ భాషలో మాట్లాడుతుంటారు. అలా కాదు ఇలా మాట్లాడండి అనే చెప్పేవారు కూడా ఉంటారు. తాజాగా తాప్సీకి కూడా ఇదే రకమైన ఘటన ఎదరువ్వగా అదిరిపోయే సమాధానం చెప్పింది.

     గోవాలో ఫిల్మ్ ఫెస్టివల్..

    గోవాలో ఫిల్మ్ ఫెస్టివల్..

    గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ గురించి తెలిసిందే. ఈ వేడుకలో భారత సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులే కాక అంతర్జాతీయ నటులు కూడా పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గొప్ప చిత్రాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ వేడుకలో ప్రారంభోత్సవం నాడు రజినీ కాంత్, అమితాబ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఓ మీడియా ప్రతినిధికి తాప్సీ ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఇంగ్లీష్‌లో మాట్లాడిన తాప్సీ..

    ఈ వేడుకల్లో భాగంగా ఆమె మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఈ సమయంలో ఆమె పూర్తిగా ఇంగ్లీష్ భాషలోనే మాట్లాడారు. కేవలం హిందీలోను ఎందుకు మాట్లాడుతున్నారు.. హిందీలో కూడా మాట్లాడొచ్చు కదా అని ప్రశ్నించాడు. అయితే ఆ భాష ఇక్కడున్న అందరికీ అర్థం కాకపోవచ్చు అందుకే ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చింది. కావాలంటే నేను పూర్తిగా హిందీలోనే మాట్లాడగలను.. మాట్లాడమంటారా? అని అంటే వద్దని అక్కడున్న వారు కోరారు.

    దక్షిణాది నటిని కూడా..

    దక్షిణాది నటిని కూడా..

    ఆ సమాధానంతో సంతృప్తి చెందని సదరు వ్యక్తి.. హిందీ సినిమాల్లో నటిస్తూ హిందీలో మాట్లాడరా? అంటూ ప్రశ్నించాడు. తాను దక్షిణాదికి చెందిన నటిని.. తెలుగు, తమిళంలో మాట్లాడితే ఓకేనా అంటూ తాప్సీ ఇచ్చిన కౌంటర్‌‌తో అతని నోరు మూసుకుపోయింది. ఈ సమాధానం చెప్పగానే హర్షద్వానాలతో తాప్సీకి చప్పట్లు కొట్టారు.

    Recommended Video

    #CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
    ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీ..

    ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీ..

    ఈ ఏడాది తాప్సీ.. బద్లా, గేమ్ ఓవర్, మిషన్ మంగళ్, సాండ్ కీ ఆంఖ్ లాంటి చిత్రాలతో పలకరిచింది. అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించడమే కాకుండా.. నటిగా మంచి పేరును తీసుకొచ్చింది. తాప్సీ ప్రస్తుతం తప్పడ్, తడ్కా చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.

    English summary
    Taapsee Counter To Reporter In IFFI. Taapsee Comments On Urvashi Rautela. I think she has got a great body, I would love to see better clothes and not just the kind that show only the body.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X