అవన్నీ మాకు అలవాటే.. అందుకే ఇలా ఒకరికొకరం.. రొమాన్స్‌లో మునిగిన తాప్సీ
ప్రస్తుతం ఇండియన్ స్క్రీన్ మీద ప్రయోగాలు చేయాలంటే మేకర్స్ అందరూ కూడా తాప్సీ వైపు చూస్తుంటారు. ఎలాంటి పాత్రలోనైనా తాప్సీ జీవిస్తుంది. దక్షిణాది నుంచి తాప్సీ ఫేమస్ అయినా కూడా ఇప్పుడు బాలీవుడ్‌లో ఆమె డిమాండ్ ఓ రేంజ్‌లో ఉంది. తెలుగులో ఝుమ్మంది నాదం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే గ్లామర్ హీరోయిన్‌గా ఓ ముద్ర వేసుకుంది. అయితే ఇప్పుడు మాత్రం నటనకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.

దక్షిణాది భాషల్లో..
తాప్పీకి మొదటగా గుర్తింపును ఇచ్చింది టాలీవుడ్. ఝుమ్మంది నాదం సినిమా తరువాత తాప్సీకి ఇక్కడ బోలెడన్నీ అవకాశాలు వచ్చాయి.స్టార్ హీరోల సరసన నటించింది. ఆ తరువాత కోలీవుడ్‌లోనూ మంచి ఆఫర్లను చేజిక్కించుకుంది. అయితే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తాప్సీకి దశ తిరిగిపోయింది.

లేడీ ఓరియెంటెడ్..
బాలీవుడ్ సినిమాల్లో తాప్సీ ఇప్పుడు మెయిన్ లీడ్‌గా ఉంటోంది. పింక్ వంటి సినిమా తరువాత తాప్సీ కెరీర్ మారిపోయింది. బాద్లా వంటి సూపర్ హిట్ వెను వెంటనే వచ్చింది. అలా తాప్సీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని కూడా రాలేదు. వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్అడ్రస్‌గా నిలిచింది.

పలు ప్రాజెక్ట్‌లు..
ప్రస్తుతం తాప్సీ చేతిలో పలు ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో రెండు స్పోర్ట్స్ డ్రామాలు కూడా ఉన్నాయి. వాటికోసం తాప్సీ చేస్తోన్న శ్రమ, పడుతున్న కష్టాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. అథ్లెట్‌గ రష్మీ రాకెట్, మిథాలి రాజ్ పాత్రలో క్రికెటర్‌గా తాప్సీ నటిస్తోంది.

తాజాగా అలా..
తాజాగా తాప్సీ తాను నటిస్తోన్న లూప్ లపేట సినిమాకు సంబంధించిన స్టిల్‌ను షేర్ చేసింది. అందులో సినిమా స్టోరీని లైట్‌గా చెప్పీ చెప్పినట్టు వదిలేసింది. అయితే ఈ లూప్ లపేట జర్మన్ చిత్రమైన రన్ లోలా రన్ చిత్రానికి అనువాదమని తెలుస్తోంది.

అవన్నీ అలవాటే..
సత్యకోసం ఇది మొదటి యుద్దం.. నా విషయానికి వస్తే గతంలో సమస్యలపై పోరాటం చేస్తూ బాగా పరిగెత్తాను.. ఇక నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను.. జీవితంలో ఎదురుదెబ్బలు తినడం అలవాటైపోయింది.. అందుకే మా ఈ జీవితంలో ఒకరికొకరం పెయిన్ కిల్లర్స్‌గా మారిపోయామని తాప్సీ ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో హీరోతో తాప్సీ బాగానే రొమాన్స్ చేసినట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











