సుశాంత్ బతికి ఉంటే కటకటాల పాలయ్యేవాడు.. తాప్సీ సెన్సేషనల్ కామెంట్స్
సుశాంత్ సింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం డ్రగ్స్ మాఫియా గుట్టురట్టవుతోంది. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని మంగళవారం అరెస్ట్ చేశారు. మూడు రోజుల విచారణ అనంతరం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రియాను అరెస్ట్ చేసింది. విచారణలో భాగంగా రియా సంచలన కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇక రియా అరెస్ట్ అవ్వడం, విచారణలో వెల్లడించిన అంశాలపై తాప్సీ స్పందించింది. మొదటి ఈ కేసులో తాప్సీ స్పందిస్తోన్న తీరు అందరికీ వింతగానే అనిపిస్తోంది.
Recommended Video

కంగనాకు వ్యతిరేకంగా..
కంగనా రనౌత్ ఆ మధ్య బీ గ్రేడ్ యాక్టర్స్ అంటూ తాప్సీపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో మనమంతా చూశాం. కంగనా సుశాంత్ కేసు గురించి మాట్లాడుతూ బాలీవుడ్, రియాను నిందిస్తుంటే.. తాప్సీ మాత్రం వారికే మద్దతు ప్రకటిస్తూ వస్తోంది.

రియా అరెస్ట్‌పైనా అంతే..
అవును నిజమే రియా అరెస్ట్ అయింది. కానీ అది సుశాంత్ కేసులో కాదు. ఆమె డ్రగ్స్ వాడిందని, కొనుగోలు చేసిందనో ఆరోపణల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేశారు. దానికి సుశాంత్ కేసుకు ఏం సంబంధం ఉందని వింతగా ప్రశ్నలు కురిపిస్తూ ట్వీట్లు చేసింది. మరో ట్వీట్ చేస్తూ సుశాంత్ పైనా ఆరోపణలు చేసింది.

సుశాంత్‌ను అరెస్ట్ చేసేవారు..
ఏది చేసినా సుశాంత్ కోసమే చేశానని రియా ఎన్‌సీబీ అధికారులతో వెల్లడించిందట. ఇదే విషయాన్ని తాప్సీ చెబుతూ.. ఆమె వాడలేదు. సుశాంత్ కోసం తెచ్చింది. వాడింది. ఒకవేళ సుశాంత్ బతికి ఉంటే అతన్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవారు. ఆమె అతనిపై డ్రగ్స్‌ను ప్రయోగం చేసి ఉండొచ్చు.. సుశాంత్ ఆమెను బలవంత పెట్టొచ్చు అంటూ కామెంట్స్ చేసింది.

నెటిజన్స్ ఫైర్..
సుశాంత్ సింగ్ రియాకు 2019లో పరిచయం అయింది.. కానీ రియాకు మాత్రం డ్రగ్స్ డీలర్స్‌తో 2017 నుంచి సంబంధాలు ఉన్నాయి.. అంటే సుశాంత్ పరిచయం కాకముందు నుంచీ అతని కోసం డ్రగ్స్ కొనుగోలు చేస్తుందా? అంటూ తాప్సీని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. కనీసం కొద్దిగానైనా ఆలోచించలేవా? అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











