For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘‘మీ మొహాలు చూడలేకపోతున్నాం’’ అంటూ ట్రోలింగ్, కూల్‌గా స్పందించిన తాప్సీ!

|

హీరోయిన్ తాప్సీ పన్ను తెలుగు సినిమాలకు దాదాపుగా దూరం అయిపోయారు. హిందీలో ఆమె కెరీర్ అద్భుతంగా ఉండటం, వరుస అవకాశాలు వస్తుండటంతో అక్కడే సెటిలైపోయారు. ప్రస్తుతం తాప్సీ పన్ను మరో నటి భూమి పెడ్నేకర్‌తో కలిసి 'సాంద్ కి ఆంఖ్' అనే చిత్రం చేస్తున్నారు.

భారత్‌కు చెందిన ఓల్డెస్ట్ ఉమెన్ షార్ప్ షూటర్స్ జీవితం ఆధారంగా 'సాంద్ కి ఆంఖ్' తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో వారు చంద్రో తోమర్(87), ఆమె సిస్టర్ ఇన్ లా ప్రకాషి తోమర్ (82)గా కనిపించబోతున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. అయితే ఈ పోస్టర్ వచ్చిన వెంటనే కొందరు నెటిజన్లు ఈ ఇద్దరు హీరోయిన్లను ట్రోల్ చేయడం ప్రారంభించారు.

ఇలా ముసలి వారిలా నటిస్తున్నారేంటి?

తాప్సీ పన్ను, భూమి పెడ్నేకర్ ఇద్దరు కూడా తమ వయసు కంటే రెట్టింపుకంటే ఎక్కువ వయసున్న పాత్రల్లో నటిస్తుండటంపై కొందరు విమర్శించడం మొదలు పెట్టారు. మీరు మీ వయసు తగిన పాత్రలు ఎంచుకోవచ్చుగా, ఆ వయసులో ఉన్న యాక్టర్లు చాలా మంది ఉండగా మిమ్మలే ఎందుకు ఎంచుకున్నారు? అంటూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు.

ఇప్పుడెందుకు అలాంటి ప్రశ్నలు?

‘నేను 30 ఏళ్ల వయసులో ఉన్నపుడు కాలేజీ అమ్మాయి పాత్రలు వేశాను. అప్పుడు ఎవరూ నన్ను నీ వయసుకు తగిన పాత్ర అది కాదు, కాలేజీ అమ్మాయిలను ఎందుకు తీసుకోలేదని అని ప్రశ్నించలేదు. ఇపుడు వృద్ధ మహిళ పాత్ర పోషిస్తున్నపుడు మాత్రం ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. మేము యాక్టర్లం... ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్దంగా ఉండాలి' అని తాప్సీ చెప్పుకొచ్చారు.

మీ మొహాలు చూడలేక పోతున్నాం

ఇప్పటి వరకు మిమ్మల్ని తెరపై గ్లామరస్ పాత్రల్లో చూశాం. యంగ్ ఏజ్ నటులుగా మమ్మల్ని అలరించారు. కానీ ఇపుడు మీరు వృద్ధులుగా కనిపిస్తుంటే చూడలేక పోతున్నాం అంటూ కొందరు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తాప్సీ సమాధానం ఇస్తూ అన్ని రకాల పాత్రలు మేము చేయడానికి సిద్ధంగా ఉండాలి, అప్పుడే మాలోని సత్తా బయట పడుతుందని చెప్పుకొచ్చారు.

సాంద్ కి ఆంఖ్

‘సాంద్ కి ఆంఖ్' పేరుతో తెరకెక్కుతున్న బయోపిక్ డ్రామాకు తుషార్ హిరానందనీ దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కశ్యప్‌తో కలిసి రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భూమి పెడ్నేకర్, తాప్సీ పన్నుతో పాటు జగదీప్ సిద్ధు, ప్రకాష్ ఝా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
“I was never questioned when I am 30-year-old and I do college characters. I was never questioned why college kids were not cast for such role." Taapsee Pannu about Saand Ki Aankh trolls. Saand Ki Aankh is an upcoming 2019 Indian biopic drama film directed by Tushar Hiranandani and produced by Anurag Kashyap, Reliance Entertainment and Nidhi Parmar. The film features Bhumi Pednekar, Tapsee Pannu and Prakash Jha as main characters. The film is a biopic based on the life of sharpshooters Chandro Tomar and her sister-in-law Prakashi Tomar. Filming began on 10 February 2019 in Baghpat. Some parts will be filmed in Hastinapur and Mawana. It is slated to release on Diwali 2019.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more