తాప్సీ, అనురాగ్ కశ్యప్‌లకు షాక్.. ఇళ్లు,ఆఫీస్‌లపై ఐటీ రైడ్స్
సెలెబ్రిటీలపై ఐటీ రైడ్స్ జరగడం అనేది కామన్. అయితే అవి జరిగే సందర్భాలు, జరుపుతున్న తీరు మాత్రమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. పైగా కొంత మందిని టార్గెట్ చేసినట్టుగా ఐటీ రైడ్స్ జరుగుతుంటాయి. తాజాగా ముంబైలోని కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీల ఇంట్లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. అయితే ఇదంతా కూడా వారి నిర్మాణ సంస్థ అయిన ఫాంతోమ్ మీద వచ్చిన ఆరోపణల వల్లే అని తెలుస్తోంది.

నిర్మాణ సంస్థ పన్నులు..
అనురాగ్ కశ్యప్, మధు మంటేనా, వికాస్ భల్ ఇలా ముగ్గురూ కలిసి ఫాంతోమ్ అనే ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది వర్కింగ్‌లో లేదు. గతంలోనే దీన్ని మూసేశారు. ఇందులో నిర్మాతల మీద లైంగిక ఆరోపణలు రావడంతో మొత్తంగా మూలన పడింది. అయితే ఇందులో పన్నుల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఇప్పుడు ఐటీ రైడ్స్ జరుగుతున్నాయట.

వారి షేర్..
అనురాగ్ కశ్యప్, మధు మంటేనా, వికాస్ భల్, విక్రమ్ ఆదిత్య ఇలా అందరూ కలిసి 2011లో ఫాంతోమ్‌ను ప్రారంభించారు. ఈ ప్రొడక్షన్ హౌస్‌లో ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఇందులో 2015 రిలయన్స్ సంస్థ కూడా వచ్చి చేరింది. యాభై శాతం షేర్‌ను సొంతం చేసుకుంది. అయితే 2018లో వికాస్ భల్ మీద వచ్చిన లైంగిక ఆరోపణలతో సంస్థలో సినిమా నిర్మాణం ఆగిపోయింది.

ఉదయం నుంచి..
అయితే ఫాంతోమ్‌లోని పన్నుల చెల్లింపుల అవకతవకలు ఉన్నాయనే సమాచారం రావడంతోనే నేటి ఉదయం నుంచి ఇళ్లు, కార్యాలయాల్లోనూ దాడులు చేస్తోన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రొడక్షన్ కంపెనీలో తాప్సీ మన్ మర్జియాన్ అనే చిత్రాన్ని చేసింది. అందుకే ఆమె ఇంట్లోనూ సోధాలు నిర్వహిస్తోన్నట్టు తెలుస్తోంది.

అందుకే అంటూ..
అయితే అనురాగ్ కశ్యప్, తాప్సీ వంటి వారు కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను వ్యతిరేకిస్తూ పోస్ట్‌లు పెడుతుంటారు. అందుకే ఇలా ఐటీ దాడులంటూ కక్ష సాధింపు చర్యలు చేపట్టారంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











