సినీ హీరోలతో అఫైర్లు పెట్టుకోను.. అందుకే అతడితో డేటింగ్ చేస్తున్నా.. తాప్సీ వ్యాఖ్యలతో దుమారం

హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో వరుస విజయాలను సొంతం చేసుకొంటున్న తాప్సీ పన్ను ఏ విషయంపైనైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం పలు సందర్బాల్లో స్పష్టమైంది. తన వ్యక్తిగత విషయాలపైనైనా లేదా సినీ పరిశ్రమలో నెపోటిజం, మీటూ విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించడంలో ముందు వెనుక ఆలోచించరు. అయితే తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, అఫైర్ గురించి క్లారిటీ ఇచ్చింది. తన ప్రియుడి గురించి క్లారిటీ ఇస్తూ...

డెన్మార్క్ క్రీడాకారుడితో డేటింగ్

డెన్మార్క్ క్రీడాకారుడితో డేటింగ్

బాలీవుడ్‌, దక్షిణాది చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న తాప్సీ పన్ను వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. సినీ ప్రముఖులతో అఫైర్లు, డేటింగ్ గురించి రకరకాల రూమర్లు వినిపించాయి. అయితే వాటికి భిన్నంగా డెన్మార్క్‌కు చెందిన షట్లర్ మాతియాస్ బోయ్ ప్రేమలో పడటం ఆశ్చర్యానికి గురి చేసింది.

 మాతియాస్ బోయ్ ఎవరంటే

మాతియాస్ బోయ్ ఎవరంటే

షట్లర్ మాతియాస్ బోయ్ గురించి చెప్పాల్సి వస్తే.. డెన్మార్క్ తరపున బాడ్మింటన్ క్రీడలో ఒలంపిక్, యూరోపియన్ గేమ్స్ అద్భుతంగా రాణించాడు. 2012లో సమ్మర్ ఒలంపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. అలాగే 2015లో యూరోపియన్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకొన్నారు. చాలా ఏళ్లుగా తాప్సీతో డేటింగ్ చేస్తూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

 అందుకే అతడితో రిలేషన్‌షిప్

అందుకే అతడితో రిలేషన్‌షిప్

మాతియాస్ బోయ్‌తో ఎందుకు ప్రేమలో పడ్డాననే విషయంపై తాప్సీ ఇటీవల క్లారిటీ ఇస్తూ.. నాకు మొదటి నుంచి సినీ ఇండస్ట్రీ వారితో రిలేషన్‌షిప్, డేటింగ్ చేయడం ఇష్టం లేదు. నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ వేర్వేరుగా ఉండాలని కోరుకొన్నాను. అందుకే విభిన్నమైన రంగానికి చెందిన మాతియాస్‌తో ప్రేమలో పడ్డాను. అతడు నా అంతర్గత జీవితంలో కీలకంగా మారారు అని వెల్లడించారు.

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తాప్సీ పన్ను

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తాప్సీ పన్ను

మాతియాస్ బోయ్‌తో పెళ్లి గురించి కూడా తాప్సీ క్లారిటీ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల నా కెరీర్ కాస్త నెమ్మదించింది. ఏడాదికి ఐదు నుంచి ఆరు సినిమాలు చేయాల్సింది. కానీ మూడు, నాలుగు సినిమాలకే పరిమితమవుతున్నారు. ఒకసారి నా కెరీర్‌ను గాడిలో పెట్టిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను. నా వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాలనుకొంటున్నాను అని తాప్సీ చెప్పారు.

Recommended Video

#CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
మిథాలీ రాజ్ బయోపిక్‌లో తాప్సీ పన్ను

మిథాలీ రాజ్ బయోపిక్‌లో తాప్సీ పన్ను

ఇక తాప్సీ పన్ను కెరీర్ విషయానికి వస్తే.. రష్మీ రాకెట్ చిత్ర షూటింగులో బిజీగా ఉన్నారు. అలాగే క్రికెటర్ మిథాలి రాజ్ బయోపిక్ కోసం సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం మిథాలీ బయోపిక్ కోసం క్రికెట్ శిక్షణ పొందుతున్నారు. అలాగే బాలీవుడ్ చిత్రాలు హసీన్ దిల్‌రుబా, లూప్ లపేటా చిత్రాలతో బిజీగా ఉన్నారు. లూప్ లపేటా చిత్రం జర్మనీ చిత్రం రన్ లోలా రన్ చిత్రం ఆధారంగా రూపొందుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X