తాప్సిపై కామెంట్స్ చేసి ఇబ్బందుల్లో పడ్డ కంగనా.. ఆ ఒక్క మాటతో కష్టమంతా వృధా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇటీవల కాలంలో నిరంతరం వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. గతంలో చాలా సార్లు అగ్ర తారాలపై విమర్శలు చేసి సక్సెస్ అయిన కంగనా ఈ సారి నెపోటిజమ్ యుద్ధంలో గట్టిగానే పోరాడినప్పటికి మధ్యలో చేసిన ఒక్క కామెంట్ తో ఇబ్బందుల్లో పడింది. చివరకు ఆమె కామెంట్స్ వల్ల ఇప్పటివరకు పడిన కష్టమంతా వృధా అవుతోంది.

మొదట మద్దతు ఇచ్చినా..

మొదట మద్దతు ఇచ్చినా..

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి గల కారణాలును చెబుతూ.. కరణ్ జోహార్, మహేష్ భట్, అలియా భట్ వంటి వారిపై విమర్శలు చేసిన కంగనా జనాలను ఎక్కువగా ఆకర్షించింది. ఆమె చేసిన నెపోటిజమ్ కామెంట్స్ కు చాలా వరకు సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ మద్దతు పలికారు. పలు అగ్ర తారలు కూడా కంగనా పోరాటంలో నిజాయితీ ఉందని కామెంట్స్ చేశారు.

మూల్యం చెల్లించుకుంటోంది..

మూల్యం చెల్లించుకుంటోంది..

అయితే మొన్నటివరకు కంగనా చేసిన పోరాటం బాగానే వర్కౌట్ అయినప్పటికి ఇటీవల తాప్సిపై చేసిన కామెంట్స్ కి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇన్ని రోజులు ఆమె పడిన కష్టమంతా ఒక్కసారిగా పక్క దారి మళ్లింది. దీంతో కంగనా విమర్శలకు వాల్యూ లేకుండా పొతోంది. కష్టం గురించి తెలిసిన కంగనా ఇలా మరో నటిపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి.

తాప్సి బి గ్రేడ్ నటి

తాప్సి బి గ్రేడ్ నటి

తాప్సి, స్వర భాస్కర్ వంటి వారు ఒక బి గ్రేడ్ యాక్టర్స్ అంటూ.. వాళ్ళు కూడా బాలీవుడ్ మాఫియాకు మద్దతుగా ఉంటారని నెపోటిజమ్ కి సపోర్ట్ చేస్తారని కామెంట్స్ చేయడంతో కంగనా ఇరుకున పడింది. తాప్సి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా కష్టపడి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనను కెరీర్ గ్రాఫ్ ను పెంచుకుంది.

విలువ తగ్గిపోయింది

విలువ తగ్గిపోయింది

కష్టపడి పైకొచ్చిన తాప్సిని బి- గ్రేడ్ నటి అనడం ఏ మాత్రం కరెక్ట్ కాదని కంగనాకు నెటిజన్స్ చురకలు అంటిస్తున్నారు.కంగనాపై వస్తున్న విమర్శలతో ఒక్కసారిగా ఆమె బాలీవుడ్ పై చేస్తున్న ఉద్యమం విలువ తగ్గిపోయింది. జనాలు ఇప్పుడు ఆమె నెపోటిజమ్ గురించి మర్చిపోయి తాప్సి చేసిన కామెంట్స్ గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
మరోసారి యూ టర్న్

మరోసారి యూ టర్న్

ఇక ఫైనల్ గా విమర్శల డోస్ ని గుర్తించిన కంగనా సెల్ఫ్ డిఫెన్స్ లోకి యూ టర్న్ తీసుకుంది. నిజానికి తాను కూడా ఒక బి-గ్రేడ్ నటినే అంటూ తాప్సిపై చేసిన కామెంట్స్ ని ఎవరు కూడా తప్పుగా అర్థం చెలుకోవద్దని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే విషయం డ్యామేజ్ కావడంతో కంగనా మాటలకు కొంచెం విలువ లేకుండా పోతోందనే కామెంట్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X