twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోతో కలిసి పీకలదాకా మద్యం సేవించిన తాప్సీ, అక్కడే పడుకోవాలని..

    |

    హీరోయిన్ తాప్సీ పన్ను సౌత్ ఇండస్ట్రీని వదిలేసి తన ఫోకస్ మొత్తం బాలీవుడ్‌పైనే పెట్టి వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె నటించిన 'మన్మర్జియాన్'లో ఘాటైన రొమాంటిక్ సీన్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. హిందీ చిత్ర సీమలో తన కెరీర్ విషయంలో ఆమె ఎంత కమిట్మెంటుతో ముందుకు వెళుతోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

    తాజాగా ఈ ఇద్దరూ ఓ టెలివిజన్ షోలో పాల్గొన్న సందర్భంగా ఆ మూవీ షూటింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తాప్సీ ఫుల్లుగా మద్యం సేవించిందట. ఈ విషయాన్ని తాప్సీ స్వయంగా వెల్లడించారు.

    ఇద్దరూ పీకలదా తాగారు

    ఇద్దరూ పీకలదా తాగారు

    ‘‘ఆరోజు మన్మర్జియాన్ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత జరిగిన పార్టీలో నేను, విక్కీ కలిసి బాగా మద్యం సేవించాం.. తర్వాత అక్కడే పడుకోవాలనుకున్నాం. మేము స్టే చేసిన హోటల్ గార్డెన్ నాకెంతో నచ్చింది. ఈ రాత్రి అక్కడే పడుకోవాలనే కోరిక కలిగింది'' అని తాప్సీ ఈ టాక్ షోలో చెప్పుకొచ్చారు.

    నేను ఎంత చెప్పినా వినలేదు

    నేను ఎంత చెప్పినా వినలేదు

    విక్కీ కౌశల్ మాట్లాడుతూ... ‘మేము స్టే చేసిన హోటల్‌లో ప్రతి రోజు డిన్నర్ అయిన తర్వాత గార్డెన్లో నడుచుకుంటూ వెళుతూ రిలాక్స్ అయ్యేవారం. ఈ రోజు పార్టీ ముగిసిన తర్వాత తాప్సీ అక్కడే ఉందామని పట్టుబట్టింది. ఆమెకు ఆ ప్లేసు అంతగా నచ్చింది. నేను ఎంత కన్విన్స్ చేసినా వినలేదు' అని గుర్తు చేసుకున్నారు.

    మన్మర్జియాన్

    మన్మర్జియాన్

    తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మన్మర్జియాన్' చిత్రానికి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. 2018లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు రూ. 40 కోట్లు వసూలు చేసింది.

    తాప్సీ పన్ను సినిమాలు

    తాప్సీ పన్ను సినిమాలు

    తాప్సీ పన్ను ప్రస్తుతం హిందీలో వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. మన్మర్జియాన్ తర్వాత ఆమె నటించని ‘బద్లా' సైతం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం తడ్కా, గేమ్ ఓవర్, మిషన్ మంగళ్, సాంద్ కి ఆంఖ్ అనే చిత్రాల్లో నటిస్తోంది. విభిన్నమైన పాత్రలు ఎంచుకోవడంలో భాగంగా ఆమె ‘సాంద్ కి ఆంఖ్' మూవీలో వృద్ధురాలైన షూటర్ పాత్ర చేయడానికి ఒప్పుకోవడం విశేషం.

    English summary
    According to a report in Mumbai Mirror, Taapsee revealed that the last time she got completely drunk was at the wrap-up party of Manmarziyaan. She said, "Both Vicky and I got too drunk and we were lying in the garden. I was like, 'This is where I will sleep tonight'."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X