బాలీవుడ్ మాఫియాలో తాప్సి బి-గ్రేడ్ హీరోయిన్.. కంగనా సంచలన వ్యాఖ్యలు.. తాప్సి కౌంటర్!

ఇంటర్వ్యూలలో కంగనా రనౌత్ చేసే కామెంట్స్ ఎంత పదునుగా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆమె కాస్త విషయం లీకైన కూడా బ్యాక్ గ్రౌండ్ లో జరిగే విషయాలన్నీ బయటపెట్టేస్తుంది. ఆమెను తట్టుకోవడం చాలా కష్టమని చాలా మంది కామెంట్స్ చేశారు. ఇక ఇటీవల తాప్సిపై కంగనా కామెంట్స్ చేయడంతో ఇద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ మొదలైనట్లు తెలుస్తోంది. బి గ్రేడ్ యాక్టర్ అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలకు తాప్సి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

Recommended Video

Taapsee Pannu Counter On Kangana Ranaut ' B - Grade ' Comments | Oneindia Telugu
సొంతంగా కష్టపడి..

సొంతంగా కష్టపడి..


బాలీవుడ్ ఇండస్ట్రీలో తాప్సి పన్ను సొంతంగా కష్టపడి అవకాశాలు దక్కించుకుంది. టాలీవుడ్ లో సక్సెస్ లేకపోయినప్పటికీ ధైర్యం చేసి బాలీవుడ్ లో అడుగుపెట్టి కొన్నాళ్లకె తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ సెట్ చేసుకునే వరకు ఎదిగింది. ఒక విదంగా కంగనా తరహాలోనే క్రేజ్ అందుకుంటోందని చెప్పాలి. అయితే అలాంటి హీరోయిన్ కి మద్దతు ఇవ్వకుండా కంగనా కొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ముప్పుతిప్పలు పెడుతున్న కంగనా

ముప్పుతిప్పలు పెడుతున్న కంగనా

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెందినప్పటి నుంచి కంగనా కరణ్ జోహార్ ని ముప్పుతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మాఫియా అలాంటి వాళ్ళ చేతుల్లోనే ఉందని ఇక వారికి కొంతమంది హీరోయిన్స్ మద్దతుగా కూడా ఉన్నారని కంగనా ఇటీవల ఆరోపణలు చేయడంతో బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్ మాఫియాలో తాప్సి..

బాలీవుడ్ మాఫియాలో తాప్సి..

తాప్సి తనను కాపీ కొడుతోందని అలాగే బాలీవుడ్ మాఫియాకు కూడా ఆమె మద్దతు ఇస్తోందని గతంలోనే వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా.. ఇక ఇటీవల కరణ్ జోహార్ లాంటి వాళ్లకు కూడా తాప్సి మద్దతు ఎక్కువగా ఇస్తుందని వ్యాఖ్యానించారు. అలాగే స్వర భాస్కర్, తాప్సి మంచి యాక్టర్స్ అయినప్పటికీ బాలీవుడ్ మాఫియా కారణంగా వాళ్ళు బి గ్రేడ్ యాక్టర్స్ గా మిగిలారని కంగనా కామెంట్స్ చేసింది.

తాప్సి కౌంటర్..

తాప్సి కౌంటర్..

కంగనా చేసిన కామెంట్స్ పై తాప్సి కూడా కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. బి గ్రేడ్ హీరోయిన్స్ అని కంగనా చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ.. కేవలం 10,12 తరగతుల్లోనే గ్రేడ్స్ ఇచ్చేవారు.. ఇప్పుడు ఇలా కూడా ఇస్తున్నారా అంటూ సెటైర్ వేసింది. అదే విదంగా కరణ్ జోహార్ కి తాను ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేయలేదని అలాగని తిట్టాల్సిన అవసరం కూడా తనకు లేదని తాప్సి క్లియర్ గా వివరణ ఇచ్చింది. మరి ఈ కామెంట్స్ కి కంగనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X