ఆ నటుడికి తాప్సీ ప్రైవేట్ మెసేజ్.. లై డిటెక్టర్ టెస్ట్ లో దొరికేసింది!

తెలుగులో గుండెఝల్లుమంది అనే సినిమా ద్వారా సినిమా రంగానికి పరిచయమయింది ఢిల్లీ భామ తాప్సీ. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్థిరపడే ప్రయత్నాలు చేస్తున్న ఈ భామ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

హసీన్ దిల్‌ రూబా

హసీన్ దిల్‌ రూబా


విక్రాంత్ మాస్సేతో కలిసి హసీన్ దిల్‌ రూబాలో అనే సినిమాలో ఇటీవల కనిపించిన తాప్సీ పన్ను ఇప్పుడు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారింది. ఎందుకంటే ఆమె ఈ సినిమాలో కాస్త హద్దులు దాటే అందాలు ఆరబోసింది. ఈ సినిమా మొన్ననే నెట్ ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయింది.

రాణి అనే గృహిణి పాత్రలో

రాణి అనే గృహిణి పాత్రలో

ఇక ఈ సినిమాలో రాణి అనే గృహిణి పాత్రలో నటించిన తాప్సీ ఈ సినిమాకు సంబంధించిన కాస్త ఘాటు రివ్యూలు కూడా అందుకుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే మంగళవారం నాడు(జూలై 6), తాప్సీ విక్రాంత్ మాస్సేతో ఒక సరదా వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

లై డిటెక్టర్ టెస్ట్

లై డిటెక్టర్ టెస్ట్

ఇక ఈ వీడియోలో భాగంగా ఇద్దరూ లై డిటెక్టర్ టెస్ట్ చేసుకుంటూ ఒకరి గురించి ఒకరు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు. అలా ఒక ప్రశ్న సమయంలో, తాప్సీ ఆమె ఒకసారి రాబర్ట్ డౌనీ జూనియర్ కి డైరెక్ట్ మెసేజ్ చేసిన విషయం పంచుకుంది.

ఆ నటుడికి డైరెక్ట్ మెసేజ్

ఆ నటుడికి డైరెక్ట్ మెసేజ్

ఈ లై డిటెక్టర్ టెస్ట్ సెషన్లో, నిన్ను ఫాలో కాని ఎవరికైనా నువ్వే డైరెక్ట్ మెసేజ్ చేసావా ? అని తాప్సీని అడిగినప్పుడు, నటి 'అవును' అని సమాధానం ఇచ్చింది. ఇక తాను రాబర్ట్ డౌనీ జూనియర్ కి డైరెక్ట్ మెసేజ్ చేశానని ఆమె వెల్లడించింది. అయితే ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఆ ఐరన్ మ్యాప్ న్ తాప్సీకి ఎప్పుడూ తిరిగి సమాధానం ఇవ్వలేదట. తన కంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ రాబర్ట్ తనకు ఎందుకు సమాధానం ఇవ్వలేదో అని నేను ఆలోచించానని ఆమె చెప్పుకొచ్చింది. అయినా సమాధానం దొరకలేదని పేర్కొంది.

Recommended Video

#CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
అప్పుడే రిలీజ్ కావలసి ఉన్నా

అప్పుడే రిలీజ్ కావలసి ఉన్నా


ఇక వినీల్ మాథ్యూస్ దర్శకత్వం వహించిన హసీన్ దిల్‌రూబా సినిమాలో తాప్సీ పన్నూ (రాణి) మరియు విక్రాంత్ మాస్సే (రిషబ్) కలిసి నటించారు. జ్వాలాపూర్ అనే చిన్న పట్టణంలో సెట్ చేయబడిన ఈ సినిమాలో తాప్సీ మరియు విక్రాంత్ లతో పాటు, ఆదిత్య శ్రీవాస్తవ మరియు హర్షవర్ధన్ రాణే కూడా కీలక పాత్రల్లో నటించారు. 2020 సెప్టెంబర్‌లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కరోనావైరస్ కారణంగా ఆలస్యం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X