హీరోయిన్ తాప్సీకి చేదు అనుభవం.. చేసిన తప్పుకు సరైన శిక్ష పడిందని కామెంట్లు.!
తెలుగులో ఎన్నో సినిమాలు చేసినా సరైన ఫలితం దక్కకపోవడంతో బాలీవుడ్‌లో స్థిరపడిపోయింది ఢిల్లీ భామ తాప్సీ పన్ను. టాలీవుడ్‌లో వరుస పరాజయాలను ఎదుర్కొన్న ఆమె.. హిందీలో మాత్రం హిట్టు మీద హిట్టు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో అత్యుత్తమ నటనను కనబరిచి ఔరా అనిపించుకుంది. అంతేకాదు, వరుసగా ఆఫర్లు అందుకుంటూ హవాను చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సొట్టబుగ్గల సుందరికి ఊహించని అనుభవం ఎదురైంది.
తాజాగా తాప్సీ ముంబై వీధుల్లో స్వయంగా బైక్ నడుపుతూ వెళ్లింది. అంతవరకు బాగానే ఉన్నా డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఆమె హెల్మెట్ ధరించలేదు. దీంతో నగర ట్రాఫిక్ పోలీసులు ఆమెకు జరిమానా విధించారు. ఈ విషయాన్ని తాప్సీనే స్వయంగా వెల్లడించింది.

ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బైక్ నడిపిన ఫొటోను షేర్ చేయడంతో పాటు 'హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు పోలీసులు నాకు జరిమానా విధించారు' అని చెప్పుకొచ్చింది. అంతేకాదు, అందరూ డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ ధరించడంతో పాటు రూల్స్ ఫాలో అవ్వాలని సూచించింది.
తాప్సీకి జరిమానా విధించడంపై ముంబై ట్రాఫిక్ పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో ఈ హీరోయిన్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా హైలైట్ అయిపోయింది. ఇదిలాఉండగా, తాప్సీ ప్రస్తుతం గుజరాత్‌కు చెందిన ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ రష్మీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న 'రష్మీ రాకెట్'లో టైటిల్ రోల్ పోషిస్తోంది. దీని తర్వాత మిథాలీ రాజ్ బయోపిక్ మూవీ 'శెభాష్ మిథూ'లోనూ నటించనుంది.


Click it and Unblock the Notifications











