twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాగైతే సినిమాలు మానేస్తా.. హీరోయిన్ సోదరిపై తాప్సీ ఫైర్!

    |

    దక్షిణాది చిత్రపరిశ్రమ, బాలీవుడ్‌లో రాణిస్తున్న తాప్సీ పన్ను తాజాగా సాండ్ కి ఆంఖ్ అనే విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ భూమి పడ్నేకర్‌తో కలిసి వయసు మీరిన షూటర్ల పాత్రను పోషించింది. అయితే ఈ సినిమా టీజర్ రిలీజైన తర్వాత కంగన రనౌత్ సోదరి రంగోలి చండేల్‌‌కు, తాప్సీకి మధ్య ఓ వివాదం నెలకొన్నది.

    గత కొద్దికాలంగా తాప్సీ, రంగోలి మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమనేంతగా వివాదం చెలరేగుతున్నది. తాజాగా ఈ సినిమా వారిద్దరి మధ్య మరోసారి చిచ్చు పెట్టింది. సాండ్ కీ ఆంఖ్ అనే చిత్రంలో పోషించిన పాత్రలను టార్గెట్ చేస్తూ రంగోలి ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వయసు మళ్లీన పాత్రలు కూడా వదిలిపెట్టవా అంటూ కామెంట్ విసిరింది. వాస్తవానికి ఈ సినిమాలోని తాప్సీ పోషించిన పాత్ర కంగనకు ఆఫర్ చేశారట. అయితే ఆ పాత్రను పోషించడానికి నిరాకరించడంతో తాప్సీకి దక్కింది.

    Taapsee Pannu fires on rangoli chandel over Saand Ki Aankh

    అయితే తనకు లభించిన పాత్రను నిరాకరించిన కంగన రనౌత్.. ఆ పాత్ర నీనా గుప్తా చేస్తే బాగుంటుందని చెప్పిందట. కానీ తాప్సీ దక్కించుకోవడంపై రంగోలి విమర్శలు చేసింది. రంగోలి చేసిన విమర్శలకు తాప్సీ సమాధానం ఇస్తూ.. ఇలాంటి విమర్శలు చేస్తే.. యాక్టింగ్‌ను వదిలేయడం, మానేయడం మంచిదేమో అని అన్నారు. లేకపోతే నా వయసుకు తగిన పాత్రలు లేదా.. యువతి పాత్రలు చేయాలేమో అని పేర్కొన్నారు.

    కాగా, తాప్సీ కెరీర్‌ ఇప్పుడు మంచి జోష్ మీద ఉంది. ఆమె నటించిన బద్లా, గేమ్ ఓవర్, మిషన్ మంగళ్ చిత్రాలతో భారీ విజయాలు అందుకొన్నారు. సాండ్ కీ ఆంఖ్, తడ్కా, తప్పడ్ అనే చిత్రాల్లో నటించింది.

    English summary
    Taapsee Pannu was again targetted by rangoli chandel. Rangoli criticised a role in Saand Ki Aankh. She suggested that you have leave aged roles to others like Neena Gupta.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X