For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఛీ ఛీ అంత విద్వేషమా!.. కంగనా పాత వీడియోలను బయటకు తీసి మరీ పరువుతీస్తోన్న తాప్సీ

  |

  సుశాంత్ సింగ్ మరణం.. ఎన్నో చర్చలకు దారితీస్తోంది. ఎంతోమందిని ఎన్నో రకాలుగా ప్రశ్నిస్తోంది. ఎన్నడూ లేనంతగా నెపోటిజం, బాలీవుడ్ మాఫియా గురించి విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. వీటిలో అందరికంటే ముందు ఉంది కంగనా రనౌత్. గతంలోనూ నెపోటిజానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒంటరిగా పోరాటం సాగించింది. అయితే సుశాంత్ మరణం తరువాత మళ్లీ కంగనా తన గొంతుకను వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాప్సీపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో చర్చ పక్కకు జరిగింది.

  బీ గ్రేడ్ అంటూ..

  బీ గ్రేడ్ అంటూ..

  సుశాంత్‌ది హత్యేనని, అందుకు కరణ్ జోహర్, మహేష్ భట్, ఆదిత్య చోప్రా, రాజీవ్ మసంద్ వంటి వారే కారణమని కంగనా మీడియాతో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో బాలీవుడ్ మాఫియా, నెపోటిజం వల్లే తాప్సీ, స్వర భాస్కర్ అలియా, అనన్య కంటే ఎంతో బెటర్ అయినా బీ గ్రేడ్ యాక్టర్స్‌గానే ఉంటున్నారని వారి గురించి పాజిటివ్‌గానే పేర్కొంది.

  తాప్సీ కౌంటర్స్..

  తాప్సీ కౌంటర్స్..

  కంగనా మాట్లాడిన మిగతా విషయాలను అంతా పక్కకు జరిపి.. కేవలం బీ గ్రేడ్ యాక్టర్స్ అన్నదాన్ని మాత్రమే పాయింట్ అవుట్ చేస్తున్నారు. తాప్సీ సైతం కంగనాకు కౌంటర్స్ వేసింది. తాను చదువుకునే రోజుల్లో పది, ఇంటర్‌లోనే గ్రేడులుంటాయని తనకు తెలుసని కానీ ఇప్పుడు సినిమాల్లో కూడా గ్రేడ్‌లు ఉన్నాయా? అంటూ సెటైర్స్ వేసింది.

  పాత వీడియోలు..

  పాత వీడియోలు..


  కంగనా మాట్లాడిన పాత వీడియోలను తాప్సీ ఇప్పుడు పోస్ట్ చేసింది. అందులో కంగనా ప్రస్తుతం మాట్లాడే వాటికి విరుద్దంగా మాట్లాడింది. మహేష్ భట్ చాలా గొప్పవాడని, ఇండస్ట్రీలో అవుట్ సైడర్స్, ఇన్ సైడర్స్ అని ఉండదని, ఒక్కసారి బ్రేక్ రావాలని, అయినా అదంతా డిసైడ్ చేసేది ప్రేక్షకులేనని, నెపోటిజం, మాఫియా వంటివి లేవని అన్నట్టుగా చెప్పుకొచ్చింది.

  తాప్సీ రివర్స్ అటాక్..

  తాప్సీ రివర్స్ అటాక్..


  కంగనా పాత వీడియోను తాప్సీ షేర్ చేస్తూ..‘అరరె.. అయితే చివరగా చెప్పేది ఏంటి మరి? ఇన్ సైడర్ అవుట్ సైడర్ అన్నది లేదా? ఏంది ఇదంతా చాలా కన్‌ఫ్యూజింగ్‌లా ఉంది.. నా స్టాండ్ ఏంటో నేనే నిర్ణయించుకోలేకపోతున్నా' అని కౌంటర్స్ వేసింది.

  మరో వీడియో..

  మరో వీడియో..

  కంగనా తన ఫ్యామిలీ గురించి చెబుతూ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు తనకు ప్రత్యేకమైన కోటా (తాత ఫ్రీడం ఫైటర్ కావడంతో) ఉందని, అలాగే ఇండస్ట్రీలోనూ స్టార్ కిడ్స్‌కి కూడా కోటా ఉంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పింది. ఆ వీడియోపై తాప్సీ స్పందిస్తూ.. ఓ అయితే ప్రతీచోట ఈ సిస్టమ్ ఉంటుందన్న మాట, ఇంకేం కథ ముగిసింది.. ప్రాబ్లమ్ సాల్వ్ అయింది.. అంటూ కౌంటర్స్ వేసింది.

  #CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
   ఛీ ఛీ అంత ద్వేషమా..

  ఛీ ఛీ అంత ద్వేషమా..

  అయితే తాప్సీ చేసిన కామెంట్లకు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో కంగనా ధైర్యంగా బయటకు వచ్చి సుశాంత్ గురించి మాట్లాడుతోందని, సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తూ పోరాడుతోందని, నీకు దమ్ముంటే నువ్ కూడాపోరాడు లేదా మూసుకుని కూర్చో అంటూ తాప్సీపై ఫైర్ అవుతున్నారు. నీకు మరీ అంత ద్వేషమా.. పాత వీడియోలు తీసి మరీ టార్గెట్ చేస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  Taapsee Pannu Intentionally Targets Kangana Ranaut With Old Vodeos. Arre !!???? Toh ab final kya hai ? Matter karta hai to be from the ‘inside’ or no. Yaar yeh sab kuch bohot confusing hota jaa raha hai Zany face I’m gonna sign out of this before I forget ki mera stand kya hai
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X