Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫిల్మ్‌ఫేర్ వివాదం.. నన్ను లాగలేదు అదే సంతోషం.. హీరోయిన్ కామెంట్స్
బాలీవుడ్లో ఈ వారం జరిగిన ఫిల్మ్‌ఫేర్ వేడుకలు ఎంతటి వివాదానికి తెరలేపాయో అందరికీ తెలిసిందే. గల్లీ బాయ్ సినిమాకు అత్యధిక అవార్డులు రావడం, అలియా భట్‌కు ఉత్తమ నటిగా అవార్డును ప్రకటించడం, డెబ్యూ చిత్రాల్లోనూ తమవారికే ప్రకటించడం నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇలాంటి మంచి అవకాశాన్ని కంగనా సోదరి రంగోలీ చందేల్ వదులుకుంటుందా? ప్రముఖ నిర్మాత, జ్యూరి సభ్యుడైన కరణ్ జోహర్‌ను ఓ ఆట ఆడేసుకుంది.
గల్లీబాయ్‌కి అవార్డుల పంట...
బాలీవుడ్లో గతేడాది వచ్చిన చిత్రాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి అవార్డులు ప్రధానం చేశారు. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన ‘గల్లీ బాయ్' సినిమా ఏకంగా 13 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడు, నటి, డైరెక్టర్, చిత్రం, సహాయ నటుడు, సహాయ నటి, మ్యూజిక్ ఆల్బమ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఇలా పదమూడు క్యాటగిరీల్లో గల్లీబాయ్ సత్తా చాటింది.
చురకలంటించిన రంగోలీ..
ఫిల్మ్ ఫేర్ అవార్డులపై రంగోలీ స్పందిస్తూ... తఖ్త్ సినిమాలోని నటీనటులందరికీ అవార్డులు ఇచ్చుకున్నావ్.. సినిమా రిలీజ్ కాకముందే అవార్డులు ఇచ్చుకున్నావా? అంటూ కరణ్ జోహర్ పరువు తీసేసింది. మణికర్ణిక చిత్రానికి గానూ కంగనాకు అవార్డు రావాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నెటిజన్ల అభిప్రాయమూ అదే..
దాదాపు నెటిజన్ల అందరి అభిప్రాయమూ అదే మాదిరిగా ఉంది. ఈ సారి ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో అవకతవకలు జరిగాయనే అంటున్నారు. అలియా మంచి నటే గానీ గల్లీబాయ్ చిత్రంలో చేసిందేమీ లేదని, అసలు జ్యూరీ సభ్యులు సినిమాను చూశారా? అని ప్రశ్నించారు. ఇంతటి వివాదాలకు దారి తీసిన అంశంపై తాప్సీ తాజాగా స్పందించింది.
నా పేరు రాలేదు అదే సంతోషం..
ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వివాదంపై స్పందించిన తాప్పీ... తన పేరు ఈ కాంట్రవర్సీలో రాలేదని, అదే తనకు సంతోషమని చెప్పుకొచ్చింది. ఈ లెక్కన చూస్తే.. తనకు అవార్డు రావడం కరెక్టే అని ఒప్పుకున్నట్లేనని తెలిపింది. సాండ్ కీ ఆంఖ్ చిత్రంలో నటనకు గానూ తాప్సీ బెస్ట్ క్రిటిక్ అవార్డు వచ్చింది.