తాప్సీ, భూమి పడ్నేకర్‌కు అరుదైన గుర్తింపు.. సీఎం యోగి ఆదిత్యానాథ్ అండతో

బాలీవుడ్ తారలు తాప్సీ పన్ను, భూమి పడ్కేకర్ నటించిన సాండ్ కి ఆంఖ్ చిత్రానికి ఉత్తర ప్రదేశ్‌లో మంచి గుర్తింపు లభించింది. భాగ్‌పట్‌కు చెందిన షూటర్లు చంద్రో తోమార్, ప్రకాషీ తోమార్ జీవిత కథా నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రానికి యూపీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. మహిళ చైతన్యం, క్రీడలకు పోత్సాహంగా నిలిచే ఈ చిత్రానికి రాజస్థాన్‌లో ఇప్పటికే పన్ను మినహాయింపు లభించిన సంగతి తెలిసిందే.

షూటర్ దాదీగా పేరు పొందిన చంద్రో తోమార్ 60 ఏళ్ల వయసులో షూటింగ్ నేర్చుకోవడమే కాకుండా దేశంలోనే అత్యున్నత షూటర్‌గా పేరు తెచ్చుకొన్నది. ఈ చిత్రం అక్టోబర్ 25వ తేదీన రిలీజ్‌కు సిద్ధమైంది. తుషార్ హిరందన్‌దాని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వినీత్ సింగ్, ప్రకాశ్ ఝా తదితరులు నటించారు.

 Taapsee Pannus Saand Ki Aankh get tax-free in Uttar Pradesh

ఇక ఈ చిత్రంలో తాప్సీ, భూమి పడ్నేకర్ ఇద్దరూ యుక్తవయస్సులో ఉండి వృద్ధులుగా నటించడం విశేషం. వీరిద్దరూ వృద్ధులుగా నటించడంపై అనేక విమర్శలు వచ్చాయి. సీనియర్ యాక్టర్లకు అవకాశం ఇవ్వకుండా ఈ సినిమాలో వారు నటించడం ఏమిటనే కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఈ విషయంలో కంగన రనౌత్ సోదరి రంగోలి చండేల్‌‌కు, తాప్సీకి మధ్య ఓ వివాదం నెలకొన్నది. తాప్సీ ముసలి పాత్రలు వేయడం అవసరమా అంటూ ప్రశ్నించడంపై తాప్సీ గట్టిగా జవాబిచ్చారు.

ఇదిలా ఉండగా, ఇప్పటికే భారీ క్రేజ్ సంతరించుకొన్న సాండ్ కీ ఆంఖ్ చిత్ర ప్రీమియర్‌ను అక్టోబర్ 20 తేదీన ముంబైలో బాలీవుడ్ ప్రముఖులకు ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షో అనంతరం తాప్సీ, భూమి పడ్నేకర్‌ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X