అతడితో నటించడానికి నో చెప్పిన తాప్సీ, కారణం ఏంటో తెలుసా?
బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ హనీ ట్రెహన్ త్వరలో దర్శకుడిగా తెరంగ్రేటం చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందుకోసం క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ సిద్ధం చేసుకున్న ఆయన ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
బాలీవుడ్ పత్రిక కథనం ప్రకారం ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం హీరోయిన్ తాప్సీని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నవాజుద్దీన్‌తో కలిసి నటించేందుకు ఆమె నో చెప్పినట్లు సమాచారం.

హనీ ట్రెహన్ చెప్పిన కథ విన్న తాప్సీ స్టోరీ నచ్చక పోవడం వల్లే ఈ ప్రాజెక్టును తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే తాప్సీ యంగ్ హీరోలతో చేయడానికే ఇష్టపడుతోందని, ఈ ప్రాజెక్టు వదులుకోవడానికి ఇది కూడా ఓ కారణం అయుండొచ్చని టాక్. ప్రస్తుతం ఆ బ్యూటీ అనురాగ్ కశ్యప్ మూవీ 'మన్మర్జియాన్' చిత్రంలో నటిస్తోంది.
కాగా... హరీ ట్రెహాన్ ఇంతకు ముందు లేడీ గ్యాంగ్‌స్టర్ సప్నా దీదీ జీవితం ఆధారంగా తెరకెక్కే థ్రిల్లర్ డ్రామా ద్వారా దర్శకుడిగా తెరంగ్రేటం చేయాలనుకున్నాడు. ఈ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్, దీపిక పదుకోన్ లీడ్ రోల్స్ గా అనుకున్నారు. విశాల్ భరద్వాజ్ నిర్మాత. అయిదే ఏం గొడవ జరిగిందో తెలియదు కానీ.... విశాల్ భరద్వాజ్ తనే సొంతగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు.


Click it and Unblock the Notifications











