ఫైటింగ్ ఆపండి.. అదేదో నేనే తేల్చుకొంటా.. అమితాబ్, షారుక్ గొడవపై తాప్సీ రియాక్షన్
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, విలక్షణ హీరోయిన్ తాప్సీ పన్ను కలిసి నటించిన బద్లా చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబట్టింది. బద్లా 100 కోట్ల మార్కును దాటి సంచలనం సృష్టిస్తున్న చిత్ర యూనిట్‌లో ఎవరూ స్పందించడం లేదని అమితాబ్ చురకలు అంటించారు. ఈ సినిమా విజయం సాధించినందుకు పార్టీ ఎప్పుడిస్తున్నావు అని షారుక్ ఖాన్‌కు చురకలు అంటించారు. బద్లా చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై షారుక్ ఖాన్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ వివాదంపై తాప్సీ ఏమని స్పందించారంటే...

బద్లా మూవీ సక్సెస్ పార్టీపై
బద్లా విజయం సాధించిన సమయంలో షారుక్ పార్టీ ఎప్పుడిస్తున్నావు అని ట్విట్టర్‌లో అమితాబ్ ప్రశ్న వేయగా.. బాద్లా సక్సెస్ పార్టీ నీవు ఎప్పుడిస్తావని ప్రతీ రాత్రి నీ ఇళ్లు జల్సా ముందు వేచి చూస్తున్నాం అని షారుక్ కౌంటర్ వేశాడు. అలా వారి మధ్య మాటలు విసురుకొంటున్న సమయంలో తాప్సీ మధ్యలో దూరింది.

నేను పార్టీ ఇస్తాను
బద్లా పార్టీ గురించి ఎవరూ ఫైటింగ్ చేయకండి.. ఆ విందు నేను ఇస్తాను. మీ అందరిని ఆ పార్టీకి ఆహ్వానిస్తాను. దానిపై ఇక వాగ్వాదం ఆపండి. ప్రస్తుతం నేను ముంబైలో లేను. నేను ముంబైకి రాగానే మిమ్మల్ని పార్టీకి పిలుస్తాను అని తాప్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

సక్సెస్ జోష్‌లో తాప్సీ పన్ను
బద్లా సినిమాలో తన పాత్రకు వస్తున్న స్పందన చూసి తాప్సీ ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో తాప్సీ నటనకు సినీ విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. వరుస విజయాలు దక్కడంపై తాప్సీ ఆనందంలో ఉన్నారు.

బద్లా రూ.150 కోట్ల వసూళ్లు
బద్లా చిత్రం దేశవ్యాప్తంగా 100 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు రూ.150 కోట్లు వసూలు చేసింది. చిన్న చిత్రంగా వచ్చిన ఈ చిత్రం సైలెంట్‌గా హిట్ కొట్టింది. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రేడ్ విశ్లేషకుల అంచనాలకు మించి ఘనవిజయం సాధించింది.


Click it and Unblock the Notifications











