ముగ్గురిలో మూడు ఆలోచనలు.. నాటి జ్ఞాపకాల్లో తాప్పీ
సౌత్‌లో గ్లామర్ డాల్‌గా ఫుల్ ఫేమస్ అయిన తాప్సీ.. ఉత్తరాదిన మాత్రం భిన్న ఇమేజ్ తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి దుమ్ములేపుతోంది. స్టార్ హీరోతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించేస్తోంది. పింక్ చిత్రంతో తాప్సీ స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్ సత్తా చాటింది. అప్పటి నుంచి తాప్సీ రేంజ్ మారిపోయింది. వరుసగా బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నటిస్తూ అందర్నీ ఆకట్టుకుంది.
పింక్ చిత్రం తరువాత బాద్లా, సాండ్ కీ ఆంఖ్, తప్పడ్, గేమ్ ఓవర్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించి మెప్పించింది. అయితే పింక్ తరువాత అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలో వచ్చిన బాద్లా బాలీవుడ్‌లో దుమ్ములేపింది. ముఖ్యంగా అమితాబ్, తాప్సీల మధ్య నడిచే సీన్స్ థియేటర్స్‌లో సీటు అంచున కూర్చొబెట్టిస్తాయి. తాజాగా తాప్సీ నాటి షూటింగ్ విశేషాలను పంచుకుంది.

అమితాబ్, తాప్సీ మధ్య వచ్చే సీన్లను తెరకెక్కిస్తున్న సందర్భంలోని పిక్‌ను తాప్సీ షేర్ చేస్తూ.. 'ఇంకా ఈరోజుకు ఎన్ని సీన్స్ మిగిలి ఉన్నాయని నేను ఆలోచిస్తున్నాను.. నిత్యం సీన్స్‌ను రిహార్సల్స్ చేస్తూ మిస్టర్ బచ్చన్ బిజీగా ఉన్నారు.. ప్యాక్ అప్ అయిన తరువాత డిన్నర్ కోసం మంచి పిజ్జాలు ఎక్కడ దొరకుతాయని సుజోయ్ ఆలోచిస్తున్నారు' అంటూ అప్పటి విశేషాలను గుర్తు చేసుకుంది. మొత్తంగా ముగ్గురిలో మూడు విభిన్న ఆలోచనలున్నాయని తాప్సీ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











