భుజం మీద చేతులేసి మరీ... అనురాగ్ కశ్యప్‌కు అండగా తాప్సీ.. మళ్లీ మనం కలుసుకుందామంటూ పోస్ట్!!
ప్రస్తుతం దేశం మొత్తం పాయల్ ఘోష్ పేరు మార్మోగిపోతంది. ప్రయాణం సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ ఘోష్ సినీ ప్రముఖులంతా ఉలిక్కిపడే విషయాలను బయటపెట్టింది. ఎంతో పేరున్న దర్శకుడైన అనురాగ్ కశ్యప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఇంటికి పిలిచి దారుణంగా ప్రవర్తించాడని, రాయలేనటు వంటి విషయాలను వెల్లడించింది. ఇక పాయల్ చేసి ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

సుశాంత్ కేసు తరువాత..
బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ మరణం తరువాత కొందరు నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చారు. కంగన రనౌత్, తాప్సీ, అనురాగ్ కశ్యప్, పాయల్ ఘోష్ వంటి వారు నిత్యం ఏదో టాపిక్ మీద మాట్లాడుతూనే ఉన్నారు. పాయల్ ఘోష్ ఈ క్రమంలో టాలీవుడ్, బాలీవుడ్ మధ్య తేడాలు, గొప్పదనాన్ని వివరించింది.

కంగనాపై దాడి..
మామూలుగా కంగనా చేసే వ్యాఖ్యలను అనురాగ్ కశ్యప్, తాప్సీ వంటి వారు కించపరుస్తుంటారు. వాటిపై రివర్స్ కౌంటర్స్ వేస్తుంటారు. సుశాంత్ ఆత్మహత్య విషయంలోనూ అనురాగ్ కశ్యప్ ప్రమేయం ఉంది, చివర్లో అనురాగ్ కశ్యప్‌ను తలుచుకుని బయపడ్డాడని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అనురాగ్ ఆఫర్‌ను తిరస్కరించానని, ఆయన తనను కొడతాడేమో అని సుశాంత్ భయపడేవాడని రియా తెలిపింది.

ఇక నేడు మరోసారి..
అలా అనురాగ్ కశ్యప్ నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చేవాడు, ఈ మధ్యే సుశాంత్ మేనేజర్, తనకు జరిగిన వాట్సాప్ చాట్‌ను బయటపెట్టాడు. ఇక తాజాగా పాయల్ ఘోష్ అనురాగ్ బండారాన్ని బయటపెట్టింది. ఇంటికి పిలిచి ఎలా ప్రవర్తించాడో వివరించింది. అనురాగ్ చేసిన చేష్టలు, పాయల్ చెప్పిన మాటలు రాయడానికి కూడా వీలుకాదు.

అదంతా కామన్..
తనతో హ్యుమా ఖురేషి, మహీ గిల్ లాంటి వాళ్లు పనిచేశారని, వాళ్లు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారని అన్నాడట.ఎప్పుడు పిలిస్తే అప్పడు వచ్చి పడుకొంటారుని తెలిపాడట. ఇలా పాయల్ చేసిన ఆరోపణలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఇక కొందరు పాయల్ ఆరోపణలు సమర్ధిస్తున్నారు. ఇంకొందరు వ్యతిరేకిస్తూ.. అనురాగ్ కశ్యప్‌కు మద్దతిస్తున్నారు.
Recommended Video

భుజంపై చేతులు వేసి..
అనురాగ్ దర్శకత్వంలో వచ్చిన మన్ మర్జియాన్ సినిమాలో తాప్సీ నటించింది. ఆ మూవీ షూటింగ్ లొకేషన్లో దిగిన ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగా.. నీ పక్కన నేనుంటా అన్నట్టు భుజం మీద చేతులు వేసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ఇది నీ కోసమే నా ఫ్రెండ్.. నువ్ మంచి స్త్రీ వాదివి అని నాకు తెలుసు. మళ్లీ మనం సెట్స్‌లో కలుసుకుందాం.. నాకు తెలుసు ఈ సారి నువ్ ఓ అద్భుతమైన, శక్తివంతమైన మహిళను తెరపై చూపించబోతోన్నావ్ అంటూ అనురాగ్ అలాంటి వాడని కాదని చెప్పకనే చెప్పింది.


Click it and Unblock the Notifications











