ఆ ఇద్దరితో నా బంధం అలాంటిదే.. మా మధ్య రిలేషన్.. టబు
గత మూడు దశాబ్దాలుగా అందం, అభినయంతోపాటు టబు సినీ పరిశ్రమలో రాణిస్తున్నది. తక్కువ సినిమాల్లో కనిపించినా విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తూ వస్తున్నారు. తాజాగా దే దే ప్యార్ దే చిత్రంలో అజయ్ దేవగన్‌తో కలిసి నటించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌కు భార్యగా నటించడం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్‌తో ఉన్న వ్యక్తిగత సంబంధాలను వెల్లడించారు.
వాస్తవానికి సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ ఇద్దరు నాకు మంచి స్నేహితులు. వారిద్దరూ నాకు ఎలాంటి కష్టం రానివ్వలేదు. ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా మా మధ్య ఉన్న బంధం ధృడపడింది. మా మధ్య ఉండే ప్రతిభ కారణంగానే రిలేషన్స్ ఏర్పడ్డాయి. వారిని నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను అని టబు చెప్పారు.

అజయ్, సల్మాన్ నాకు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు. నా మంచి, చెడును చూసుకొంటారు. మా మధ్య స్వచ్చమైన స్నేహం, ప్రేమ ఉంది. మనసులో ఎలాంటి సంకోచాలు లేకుండా వారిద్దరిని నేను ఇష్టపడుతాను అని టబు అన్నారు. మా మధ్య రిలేషన్‌కు ఎలాంటి రూమర్లు లేకపోవడం నిజంగా అదృష్టమే అని టబు అన్నారు.
బాలీవుడ్‌లో టుబుకు తొలి సక్సెస్ విజయ్‌పథ్ సినిమా నుంచి వచ్చింది. ఆ చిత్రంలో అజయ్ దేవగన్‌తో కలిసి నటించారు. అప్పటి నుంచి వారి మధ్య స్నేహం అలాగే కొనసాగుతున్నది. వారిద్దరూ హకీకత్, తక్షక్, దృశ్యం, ఫితూర్, గోల్ మాల్ అగైన్, తాజాగా దే దే ప్యార్ దే సినిమాలో కలిసి నటించారు. ఇక సల్మాన్ ఖాన్‌తో బీవీ నంబర్ 1, హమ్ సాత్ సాత్ హై, జై హో, ప్రస్తుతం భారత్ చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











