నాపై అలాంటి కంప్లయింట్స్.. సీనియర్ హీరోయిన్ టబు
బాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్ టుబు మళ్లీ ట్రాక్‌పైకి వచ్చింది. అంధాదున్, దే దే ప్యార్ దే సినిమాలు ఆమెకు మరోసారి మంచి స్టార్టప్ ఇచ్చాయి. దాంతో వరుస చిత్రాలపై టబు దృష్టిపెట్టి మళ్లీ తన కెరీర్‌ను నిలబెట్టుకోవడానికి ప్లాన్ చేసుకొంటున్నది. తాజాగా దే దే ప్యార్ దే సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో టబు మీడియాతో తన అభిప్రాయాలను, భవిష్యత్ కార్యాచరణను పంచుకొన్నాయి. టబు చెప్పిన విషయాలు మీ కోసం..

నా ఫెర్ఫార్మెన్స్‌కు
దే దే ప్యార్ దే సినిమా సక్సెస్ నాకు మళ్లీ కాన్ఫిడెన్స్‌ను ఇచ్చింది. కథ చెప్పినప్పుడే చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఆ పాత్రలో నటించడానికి స్కోప్ ఉందని భావించిన వెంటనే మంజురావు పాత్రను అంగీకరించాను. నా శయశక్తుల నేను ఆ పాత్రకే న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నించాను. నా ఫెర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు లభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే నేను ఎప్పుడూ ప్రశంసలకు పొంగిపోను అని టబు అన్నారు.

అంధాదున్ సినిమా సక్సెస్‌తో
విజయాన్ని తలకెక్కించుకోవద్దనే విషయాన్ని నేను జాగ్రత్తగా పాటిస్తాను. నా తల్లి, సోదరి ఫరా ఎప్పుడూ ఈ విషయాన్ని గుర్తు చేస్తుంటారు. అంధాదున్ సినిమా సక్సెస్ సాధించినప్పుడు ఇదే మాటను వాళ్లిద్దరూ నాకు మరోసారి హెచ్చరించారు. అంధాదున్ సినిమాపై నా తల్లి ప్రశంస ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సవాల్‌తో కూడిన పాత్రను చేశావు అంటూ నా తల్లి, తెరపైన నిన్ను చూసినట్టుగానే ఉందని నా చెల్లెలు చెప్పారు అని టుబు పేర్కొన్నది.

కెరీర్ ప్లాన్‌పై పెద్దగా దృష్టి..
నా సినిమాలకు మంచి ప్రేక్షదరణ పొందడం హ్యాపీగా ఉంది. ఆచితూచి కాకుండా ఎక్కువ సినిమాలు ఎందుకు చేయవు అని అందరూ నాపై కంప్లయింట్స్ చేస్తుంటారు. నా కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలనే విషయంపై పెద్దగా దృష్టిపెట్టలేదు. నా చుట్టు ఉన్నవాళ్లు, అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమకు ఆనందంగా ఉంది. వారికోసమైనా సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నాను అని టుబు అన్నారు.

జూన్ తేదీన 5న భారత్ చిత్రంతో
వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న టబు ప్రస్తుతం సినిమాల సంఖ్యను పెంచేందుకు ప్లాన్ చేస్తున్నది. ఆమె నటించిన దే దే ప్యార్ దే సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తుండగా, త్వరలోనే టబు నటించిన భారత్ సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం జూన్ 5న రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











