ప్రముఖ డైరెక్టర్‌తో హీరోయిన్ టబు.. ఆస్ట్రేలియాలో హంగామా!

బాలీవుడ్‌లో చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సాధించిన అంధాధున్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రజాదరణను, సినీ విమర్శకుల ప్రశంసలను అందుకొంటున్నది. ఈ చిత్రం ఇటీవల చైనాలో రిలీజై భారీ వసూళ్లను సాధించింది. అంతేకాకుండా ఈ సినిమా ఆస్ట్రేలియాలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ చిత్రాన్ని మెల్‌బోర్న్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ప్రదర్శించడం విశేషంగా మారింది.

పదిరోజులపాటు సాగే ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు హీరోయిన్ టుబు, దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా శ్రీరాం రాఘవన్ మాట్లాడుతూ.. బ్లాక్ కామెడీతో రూపొందిన అంధాధున్ థ్రిల్లర్‌కు విశేషంగా పేరు రావడం ఆనందంగా ఉంది. ఆస్ట్రేలియా ప్రేక్షకుల అనుభూతిని పంచుకోవడానికి టబుతో కలిసి తాను ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరవుతున్నాను. ఆస్ట్రేలియా కల్చరల్ కాపిటల్ విక్టోరియాలో ఆగస్గు 8 నుంచి 17 వరకు ప్రదర్శనలు కొనసాగుతాయి. మేము ఈ ఫెస్టివల్‌కు హాజరుకానున్నాం అని అన్నారు.

 Tabu, Sriram Raghavan attending Film Festival Indian Film Festival of Melbourne

అంధాధున్ చిత్రంతో జర్నీ ఎక్టైటింగ్‌గా, కొత్త అనుభూతికి గురిచేస్తున్నది. మెల్‌బోర్న్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో మా సినిమా ప్రదర్శింపబడటం మా కెరీర్‌లో మైలురాయిగా భావిస్తున్నాం. భారతీయ సినిమాలను ఆదరించే ఆస్ట్రేలియా అభిమానులతో మా అనుభవాలను పంచుకోబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని దర్శకుడు శ్రీరాం రాఘవన్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X