‘టుబు ఇంకా నన్నే కోరుకొంటున్నది.. నాకు పెళ్లైనా అందుకే ఆమె ఒంటరిగా’
సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లకు మధ్య అఫైర్, డేటింగ్ కొనసాగడం బ్రేకప్ అయిన తర్వాత మరోదారి చూసుకోవడం సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. కానీ హీరోయిన్ టబు విషయంలో అందుకు భిన్నంగా కనిపిస్తుంటుంది. ఆమె జీవితంలో అఫైర్లు, బ్రేకప్‌లు ఉన్నా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటూనే ఉంది. అందుకు కారణం తన జీవితంలోకి మరొకరిని రానివ్వకపోవడం, ఇష్టపడకపోవడమే అని తన సన్నిహితులు చెబుతుంటారు.
అయితే టబు పెళ్లి చేసుకోకపోవడంపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ చెప్పిన కారణం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. గతంలో ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆసక్తిని రేపుతున్నది. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..
సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి అజయ్ దేవగన్, టుబుకు పరిచయం ఉంది. బెస్ట్ బడ్డీస్, ఫ్రెండ్స్‌లా ఉండే వారు. ఒకరంటే మరొకరికి ఇష్టం ఉండేది. అయితే తన మొదటి రెండు సినిమాలు హిట్ అయిన తర్వాత కాజోల్‌తో అజయ్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకొన్నారు. దాంతో టబు దిక్కు తొచని పరిస్థితుల్లో పడిపోయింది.

అజయ్, టబు మధ్య ప్రేమ ఉంది. కానీ వారు ఒకరికొకరు చెప్పుకొని నిర్ణయం తీసుకోలేకపోయారనేది వారిద్దరి స్నేహితులు చెప్పుకొంటారు. వారి మధ్య ఉన్న ప్రేమ ఇప్పటికీ అలానే కొనసాగుతూనే ఉంటుంది. వారిద్దరూ కలిసి నటించినా, వారిద్దరూ ఏదైనా ప్రెస్ మీట్‌లో కనిపించినా ఇద్దరి మధ్య కనిపించే కెమిస్ట్రీ లవర్స్‌ను మంచి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటారు.
ఒకనొక సందర్భంలో జాతీయ మీడియాతో అజయ్ మాట్లాడుతూ.. టబుకు నేను కావాలి. కానీ నేను ఆమెకు చేరువ కాలేను. అదే మా మధ్య ఉన్న సమస్య. నాలాంటి వ్యక్తి ఫ్రెండ్. ఇంకొకరు ఈ ప్రపంచంలో ఆమెకు దొరకడు. అలాగే ఆమెను నాలాగా ఎవరూ కూడా ఇష్టపడరు. అందుకే ఆమె నన్నే కోరుకొంటుంది అని అజయ్ దేవగన్ అన్నారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఇదిలా ఉండగా, నాగార్జున, టుబు మధ్య కూడా అఫైర్ కొనసాగిందనే విషయం కూడా ఆసక్తిని కలిగించేదే. నిన్నే పెళ్లాడుతా సమయంలో వారిద్దరి మధ్య బంధం బలంగా మారింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆ విషయాన్ని స్వయంగా నాగార్జున కూడా తన ఇంటర్వ్యూలో చెప్పడం తెలిసిందే.

టబు కెరీర్ విషయానికి వస్తే.. హిందీ సినిమా రంగంలో ఆచీతూచి సినిమాలు చేస్తున్నది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో టబు హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమా గురించిన ప్రకటన అధికారికంగా ఇటీవలే వెలువడింది. దాంతో మరోసారి సౌత్‌తో టబు అనుబంధాన్ని పెంచుకోబోతున్నారు. అలా వైకుంఠపురంలో తర్వాత టుబు మరోసారి తెలుగు ప్రేక్షకులకు చేరువ కానున్నది.


Click it and Unblock the Notifications











