తైమూర్ కేర్ టేకర్ జీతం.. సోషల్ మీడియాలో వైరల్
సెలెబ్రిటీలకు తమ పిల్లలను చూసుకునే తీరిక ఉండదు. కొంతమంది సెలెబ్రిటీలు తమ పిల్లలకు కేర్ టేకర్ లాంటి వారిని నియమిస్తూ ఉంటారు. ఈ కల్చర్ ఎక్కువ బాలీవుడ్‌లో కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ కేర్ టేకర్ విషయమంటే.. తైమూర్ ఖాన్‌కు సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తాయి. ఎందుకంటే తైమూర్ కెమెరా కంటికి చిక్కినప్పుడల్లా అతని కేర్ టేకర్ కూడా పక్కనే ఉంటుంది.
తైమూర్ ఖాన్‌తో పాటు ఆ కేర్ టేకర్ కూడా ఫేమస్ అయింది. అయితే ఆ ఆయా మరోసారి వార్తల్లో నిలిచింది. కరీనా నటించిన తాజా చిత్రం 'గుడ్‌న్యూస్'భారీ విజయాన్ని నమోదు చేసిన కారణంగా.. ఓ మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో తన కొడుకు రక్షణ కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని ముఖ్యం కాదని చెప్పుకొచ్చింది. బిడ్డ ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటాడో వారికే అప్పగిస్తానని తెలిపింది.

ఇక తైమూరు బయటికి వస్తే చాలు చేరి సెల్ఫీల కోసం జనాలు పోటీ పడుతుంటారు. అలాంటి సమయాల్లో మీడియా, ఫ్యాన్స్ నుంచి తైమూర్‌ని రక్షించడం కోసం ఓ కేర్‌టేకర్‌ను ఉందన్న సంగతి తెలిసిందే. నిరంతరం తైమూర్ వెంటే ఉండే ఆమెకు నెలకు లక్షా ఇరవై ఐదు వేలు చెల్లిస్తున్నారంటూ కొంతకాలంగా బీ-టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఏదైనా ప్రత్యేక సందర్భంలో అతడితో పాటే ఉండాల్సి వస్తే మరో 50 వేలు కూడా అదనంగా ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











