లైవ్‌లో దర్శనమిచ్చిన తైమూర్.. పగలబడి నవ్విన యాంకర్
ప్రస్తుతం నెలకొన్ని ఉన్న పరిస్థితుల దృష్యా అందరూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇదంతా కరోనా పుణ్యమే. ఒకప్పుడు సెలెబ్రిటీలను ఇంటర్వ్యూలు చేయాలంటే వారే స్టూడియోలకు రావడం, లేదా మీడియానే వారి ఇంటికి వెళ్లడమో జరుగుతూ ఉండేది. అయితే కరోనా విజృంభణతో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఎవరి ఇంటి వద్ద వారే ఉండి లైవ్‌లోనే ఇంటర్వ్యూను నిర్వహిస్తున్నారు. తాజాగా అలా సైఫ్ అలీఖాన్ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తుండగా మధ్యలో బుడ్డోడు ఎంట్రీ ఇచ్చాడు.
తైమూరో అలీ ఖాన్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. ఆ బుడ్డోడి ఆయాకు కూడా విపరీతంగా క్రేజ్ వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు. బయటకు వచ్చినప్పుడల్లా తైమూర్ ఫోటోలు వైరల్ కావడం, ముద్దు ముద్దు మాటలు, సైగలు, సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేవి. అంతేకాకుండా తైమూర్ బొమ్మలకు ఎంతో గిరాకీ ఉండేది.

తాజాగా మరోసారి తైమూర్ తన ఫాలోవర్స్‌ను ఎంటర్టైన్ చేశాడు. తన తండ్రి ఇస్తున్న ఇంటర్వ్యూ మధ్యలో దూరిపోయాడు. తన తండ్రి సైఫ్ అలీ ఖాన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతోన్న సమయంలో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాడు. ఈ వీడియో కడుపుబ్బా నవ్విస్తోంది. సీరియస్‌గా మాట్లాడుతోన్న సమయంలో మధ్యలో వచ్చిన తన కుమారుడిని చూసి సైఫ్ అలీ ఖాన్ కూడా నవ్వాడు. ప్రేక్షకులకు సారీ చెప్పి, తైమూర్‌కి కిస్ ఇచ్చాడు. తైమూర్ క్యూట్ లుక్స్, మాటలకు యాంకర్ నవ్వు ఆపుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











