»   »  అక్షయ్ కుమార్‌కు కరీనా ఓపెన్ ఛాలెంజ్.. తైమూర్ ఒకవైపు, నువ్వొకవైపు!

అక్షయ్ కుమార్‌కు కరీనా ఓపెన్ ఛాలెంజ్.. తైమూర్ ఒకవైపు, నువ్వొకవైపు!

Subscribe to Filmibeat Telugu

కరీనా కపూర్ వివాహానంతరం కూడా సినిమాలతో బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ కుటుంబంతో గడిపేందుకు సమయాన్ని కేటాయిస్తోంది. ముఖ్యంగా తన కొడుకు తైమూర్ కోసం కరీనా సమయాన్ని కేటాయిస్తోంది. తైమూర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తైమూర్ తన క్యూట్ లుక్స్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు. నెటిజన్లు తైమూర్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

తైమూర్ ఇంకా ఏడాది బాలుడే కావడం విశేషం.తైమూర్ ఏ సందర్భానికి సంబదించిన ఫొటోలు అయినా ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ లో కరీనా కపూర్ సరదాగా అక్షయ్ కుమార్ కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిందట. నీకు నా కుమారుడు తైమూర్ సరైన పోటీ. ని అభిమానుల సంఖ్యని కూడా తైమూర్ దాటేస్తాడు. ఓపెన్ ఛాలెంజ్ అని కరీనా అక్షయ్ తో సరదాగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

Taimur is a threat to Akshay Kumar, Kareena Kapoor Khan says

తైమూర్ కు రోజు రోజుకు ఇంటర్నెట్ లో పెరుగుతున్న ఫాలోయింగ్ గురించి కరీనా మాట్లాడింది. 14 నెలలు కూడా నిండని తన బాబు సోషల్ మీడియాలో ఎందుకు ఇంతలా వైరల్ గా మారుతున్నాడా తనకు అర్థం కావడం లేదని తెలిపింది. తైమూర్ కు సంబందించిన ఏ ఫోటో అయినా నెట్ లో హల్ చల్ చేస్తుండడంతో కరీనా మాట్లాడింది.

English summary
Taimur is a threat to Akshay Kumar, Kareena Kapoor Khan says. Taimur pics going viral in social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X