కరోనాతో ఆప్తుడి మృతి.. విషాదంలో మునిగిన ఆలియా, రణ్‌బీర్

కరోనావైరస్ కారణంగా ఓ ఆప్తుడిని కోల్పోవడంతో బాలీవుడ్ తారలు ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ విషాదంలో మునిగిపోయారు. తమకు అత్యంత ఇష్టమైన రెస్టారెంట్ సర్వర్ రొనాల్డో డీ మెల్లో మరణించడం ఆలియా, రణ్‌బీర్‌ను కలిచివేసింది. ముంబై తాజ్ హోటల్‌‌లోని వాసాబిలో సర్వర్‌గా పనిచేసే రొనాల్డో ఇటీవల కరోనావైరస్ సోకడంతో మరణించారు.

ఇటీవల రొనాల్డ్ రిటైర్మెంట్ సమయంలో ఓ భావోద్వేగమైన లేఖను సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. తాజ్ హోటల్‌కు వెళ్లిన ప్రతీసారి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకొనేవారు. అప్యాయతతో ఫుడ్‌ను వడ్డించే వారు అంటూ రొనాల్డో రిటైర్మెంట్ రోజున కలిసి దిగిన ఫోటోను ఆలియా, రణ్‌బీర్ షేర్ చేశారు.

Taj Hotel server Ronald DMello died this corona: Ranbir, Alia into sad

అలాంటి రొనాల్డో ఇకలేరనే వార్తతో ఆలియా, రణ్‌బీర్ తల్లడిల్లిపోయారు. ఆయన మరణవార్త మా హృదయాలను పిండేసింది. చాలా మంచి, నిజాయితీతో కూడిన వ్యక్తి. నిఖార్సైన ప్రొఫెషనల్ అంటూ రొనాల్డోపై ప్రశంసలు గుప్పించింది. నాకు దగ్గరైన వ్యక్తుల్లో రొనాల్డో ఒకరు అంటూ అలియా తీవ్ర దిగ్రాంతిని వ్యక్తి చేశారు. ఏది ఏమైనా.. ఆయన ఏ లోకాన ఉన్నా రొనాల్డో ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ అలియా భట్ సంతాపం వ్యక్తం చేశారు.

కాగా, ముంబైని కరోనావైరస్ వెంటాడుతున్నది. గత 10 రోజుల్లో అతితక్కువ కేసులు శుక్రవారం నమోదయ్యాయి. కేవలం ముంబైలో గత 11 రోజుల్లో 941 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ముంబైలో 12 వేలకుపైగా కేసులు నమోదు కాగా, అందులో 414 మంది మరణించారు. గత 24 గంటల్లోనే 37 మరణాలు చోటుచేసుకోవడం కరోనా తీవ్రత ఎంత అనేది స్పష్టమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X