For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  15 ఏళ్లకే ఆ అనుభవం.. నా జీవితంలో అలాంటి చేదు సంఘటనలు.. తమన్నా

  |

  భారతీయ సినిమా పరిశ్రమలో తమన్నా భాటియా ప్రస్తుతం అగ్రతార. ఆమె నట జీవితం కేవలం 15 వయసులోనే ప్రారంభమైంది. 2005లో తెలుగులో శ్రీ అనే చిత్రంలో మంచు మనోజ్ సరసన నటించడం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో కేడీ అనే తమిళ చిత్రంలోనే నటించింది. ఆ తర్వాత హ్యాపీ డేస్, కల్లోరి సినిమాలతో దక్షిణాదిలో పాగా వేసింది. తాజాగా ఆమె నటించిన ఖామోషీ సినిమా రిలీజ్ సందర్భంగా తన సినీ ప్రయాణంలోని అనుభవాలను పంచుకొన్నారు. ఆమె ఏమన్నారంటే..

  15 ఏళ్ల వయసులోనే నాకు

  15 ఏళ్ల వయసులోనే నాకు

  సినిమా పరిశ్రమలో చాలా వేగంగా అగ్రస్థానికి ఎదిగాను. వయస్సు, మానసిక పరిణతికి సంబంధం లేకుండా నేను హీరోయిన్‌గా రాణించాను. యాక్టర్ కావాలనే బలమైన కోరిక నన్ను అలా ప్రోత్సహించింది. 15 ఏళ్ల వయసులోనే కెమెరా ముందు నటించే అనుభవం నాకు లభించింది. స్టార్ డమ్ అనేది మన చేతులో లేదని, దానిని కంట్రోల్ చేయలేమనే విషయాన్ని త్వరగా తెలుసుకొన్నాను. దక్షిణాదిలో నాకు లభించిన ఫ్యాన్స్ గురించి మాటల్లో చెప్పలేను అని తమన్నా చెప్పింది.

   టీనేజ్‌లో ఉండగానే ఆఫర్లు

  టీనేజ్‌లో ఉండగానే ఆఫర్లు

  టీనేజ్ వయసులోనే ఉండగానే నాకు తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో నాకు ఆ రెండు భాషాలను నేర్చుకొంటానే అనే సందేహం కలిగింది. కానీ లేత వయసులోనే తమిళ, తెలుగు భాషలు నేర్చుకోవాలనే పట్టుదల కలిగింది. అందుకే భాషపై దృష్టిపెట్టాను. ప్రాప్టింగ్ ఇవ్వొద్దని కండిషన్ పెట్టి సెట్లో నేను ఆ రెండు భాషలు నేర్చుకొన్నాను అని మిల్కీ బ్యూటీ వెల్లడించింది.

   సినీ పరిశ్రమలో అలాంటి అభద్రతాభావం

  సినీ పరిశ్రమలో అలాంటి అభద్రతాభావం

  సినిమా పరిశ్రమలో అభద్రతాభావం ఉంటుందని తెలుసు. ప్రతీ శుక్రవారం జతకాలు మారిపోతుంటాయనే విషయం కూడా అర్థమైంది. ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడూ చెక్ చేసుకొనే దానిని. నా కెరీర్‌లో కొన్ని శుక్రవారాలు మధురమైన అనుభవాలను అందిస్తే.. మరొకొన్ని శుక్రవారాలు చేదు అనుభవాలను మిగిల్చాయి. ప్రతీ శుక్రవారం నాకు లక్ష్యంగా మారేది. అదీ దృష్టిలో పెట్టుకొని కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాను అని తమన్నా పేర్కొన్నది.

   అలా కెరీర్‌ను గాడిలో పెట్టుకొన్నా

  అలా కెరీర్‌ను గాడిలో పెట్టుకొన్నా

  హీరో ఓరియెంటెడ్ మూవీస్‌లో నేను పాటలకు, డ్యాన్సులకు పరిమితమయ్యే పాత్రలను చేశాను. 100% లవ్, బాహుబలి లాంటి చిత్రాల్లో నాకు ప్రాధాన్యం ఉండే పాత్రలు లభించాయి. మరొకొన్ని సినిమాల్లో గ్లామర్ పండించే పాత్రలు దక్కాయి. అయితే నాకు నచ్చిన పాత్రలను ఎంపిక చేసుకొంటూ నా కెరీర్ గాడిలో పెట్టుకొన్నాను అని తమన్నా చెప్పింది.

   హిందీలో దారుణమైన ఫ్లాపులు

  హిందీలో దారుణమైన ఫ్లాపులు

  హిందీలో నేను నటించిన హిమ్మత్ వాలా, ఎంటర్‌టైన్‌మెంట్, హమ్ షకల్స్ సినిమాలు దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఆ సమయంలో ఆ సినిమాలపై బాగా అంచనాలు ఉండేవి. ఆ అంచనాలు మించకపోవడంతో ప్రేక్షకులు తెప్పికొట్టారు. ఆ సినిమాల్లో కథ, కథనాలు బాగాలేకపోవడమే ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి. ఆ తర్వాత నాకు ఎక్సైటింగ్‌గా ఉండే చిత్రాల్లో మాత్రమే నటిస్తున్నాను అని తమన్నా అన్నారు. దర్శకుడు చక్రీ తోలేటి నటించిన ఖామోషీ సినిమాలో తమన్నా, ప్రభుదేవాలు కలిసి నటించారు. ఈ చిత్రం జూన్ 14న రిలీజ్ అవుతున్నది.

  English summary
  Making her screen debut at the age of 15 and becoming a star in the south film industry before finding space in Hindi cinema prepared Tamannaah Bhatia about the fickle nature of fame. Born and raised in Mumbai, the actor made her debut with the 2005 Telugu film Sri, followed by her Tamil film Kedi. She achieved success two years later, with Happy Days and Kalloori.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X