విజయ్ వర్మతో డేటింగ్? తమన్నాతో క్లోజ్‌గా ఫాతిమా.. మిడ్ నైట్ జంటగా చిందులు
మిల్కీబ్యూటీ తమన్నా భాటియా - విజయ్ వర్మల బ్రేకప్ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసిన సంగతి తెలిసిందే. మూడేళ్లు కలిసి ఎంజాయ్ చేసిన ఈ ప్రేమపక్షులు తమ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ ఏడాది ఖచ్చితంగా పెళ్లీ పీటలెక్కే జంటల్లో వీరిద్దరూ ఖచ్చితంగా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా తమన్నా- విజయ్‌లు బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఇది జరిగి రోజులు గడవకముందే విజయ్ వర్మ మరో నటితో రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు రావడంతో బాలీవుడ్ షాకైంది.
తమన్నా- విజయ్ బ్రేకప్‌కు కారణం అదేనా?
పెళ్లి చేసుకుని త్వరగా జీవితంలో సెటిల్ అయిపోవాలని తమన్నా భాటియా పట్టుబట్టగా.. కెరీర్‌పై ఫోకస్ చేసేందుకు కొంతకాలం పెళ్లిని వాయిదా వేయాలని విజయ్ భావించడమే వీరిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణంగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ జంట విడిపోయి ఎవరిదారి వారు చూసుకున్నారు. సినిమాలతో ఇద్దరూ బిజీగా ఉన్నారు. తమన్నా సినిమాలతో పాటు ఐటెం సాంగ్స్‌తో దుమ్మురేపుతున్నారు. రిలేషన్ నుంచి బయటికొచ్చాక చాలా ప్రశాంతంగా ఉందన్న ఆమె.. స్వేచ్ఛగా పనిచేసుకుంటూ వెళ్తున్నట్లు తెలిపింది.

ఫాతిమతో క్లోజ్‌గా విజయ్
అయితే తమన్నాతో బ్రేకప్ చెప్పిన కొద్దిరోజులకే విజయ్ వర్మ.. దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్‌తో ఆయన ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఓ రెస్టారెంట్ వద్ద కలుసుకున్న విజయ్- ఫాతిమాలు చాలా సన్నిహితంగా మెలిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఫాతిమా వీటిని ఖండించారు. తమ మధ్య ఎలాంటి బంధం లేదని.. ఒకే సినిమాలో కలిసి నటిస్తున్న నటీనటులు.. కలిసి భోజనం చేయకూడదా? అని ఎదురు ప్రశ్నించడంతో మీడియా అవాక్కయ్యింది. తను ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటున్నట్లు ఫాతిమ కుండబద్ధలు కొట్టింది.
నమ్మకంపై తమన్నా పోస్ట్
ఫాతిమా సనా షేక్‌తో విజయ్ వర్మ డేటింగ్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై అతని మాజీ ప్రియురాలు, స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా పరోక్షంగా స్పందించారు. విజయ్ పేరెత్తకుండా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసింది. ప్రతి అంగుళాన్ని మనం పూర్తి చేయకపోవడం కూడా నమ్మకమేనని .. ప్రతిక్షణం సంపూర్ణం కాకపోవచ్చు.. కానీ కొన్ని క్షణాలు మాత్రం ప్రశాంతంగా ఉండేందుకు ఉపయోగపడతాయని మిల్కీబ్యూటీ వేదాంత ధోరణిలో రాసుకొచ్చింది.
తమన్నాతో క్లోజ్‌గా ఫాతిమ
వాతావరణం ఇలా ఉన్న పరిస్థితుల్లో తమన్నా భాటియాతో క్లోజ్‌గా ఉన్న ఫాతిమ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సినీ జనాలు షాక్ అవుతున్నారు. ఇండియా కోచర్ వీక్ కోసం స్టార్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన పార్టీలో తమన్నాతో పాటు కొందరు ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమన్నా, ఫాతిమాలు చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో ఏం జరుగుతుందో అర్ధం కాక జనాలు జుట్టు పీక్కుంటున్నారు. ఈ ఫోటోలపై నెట్టింట హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. అన్నట్లు విజయ్ వర్మ- ఫాతిమా సనా షేక్ నటిస్తోన్న గుస్తాఖ్ ఇష్క్‌కు మనీష్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో నసీరుద్దీన్ షా, షరీబ్ హష్మీలు కీలకపాత్ర పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











