తమన్నా భాటియా శృంగార విన్యాసాలు.. మిల్కీ బ్యూటీ గ్లామర్ ట్రీట్‌పై లవర్ హాట్ కామెంట్
మిల్కి బ్యూటీ తమన్నా భాటియా శృంగార ప్రదర్శనలో తనకు తానే సాటి అనిపించుకొనే విధంగా సిల్వర్ స్క్రీన్‌పై అందాల తాండవం చేస్తున్నది. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌తో కేక పెట్టించిన ఈ అందాల భామ దక్షిణాదిలో అగ్ర హీరోలతో జతకట్టి క్రేజ్ పెంచుకొన్నది.
రజనీకాంత్‌తో జైలర్, చిరంజీవితో భోళా శంకర్ సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన జైలర్ చిత్రంలోని పాటలో అందాల ఆరబోత సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ వ్యవహారంపై ఆమె ప్రియుడు విజయ్ వర్మ ఎలా స్పందించారంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న జైలర్ చిత్రంలో తమన్నా భాటియా కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను ఇటీవల ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ పాటలో తమన్నా అందాలు, రజనీకాంత్ స్టైల్, స్వాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రజనీతో తమన్నా వేసిన స్టెప్పులు అభిమానులతో కేక పెట్టించాయి.
తమన్నా భాటియా పెర్ఫార్మ్ చేసిన కావాలా సాంగ్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. హాట్ హట్‌గా నటించడంతో ఆమె స్టెప్పులు గురించి సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతున్నది.ఆ పాటకు సంబంధించిన తమన్నా వీడియోలు, ఫోటోలు ట్విట్టర్‌లో వెల్లువెత్తుతున్నాయి. ఇన్స్‌టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో రీల్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన జైలర్‌లోని కావాలా పాటకు అరుణ్ రాజ్ కామరాజ్ సాహిత్యం అందించారు. శిల్పారావు ఈ పాటను ఆలపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాటకు సంబంధించిన వీడియోను, పాటను తమన్నా భాటియా ప్రియుడు విజయ్ వర్మ షేర్ చేసి.. సిల్వర్ స్క్రీన్ దేవుడు, దేవత అంటూ కామెంట్ చేశారు.

తమన్నా నటించిన జైలర్‌లోని కావాలా పాటకు సంబంధించిన వీడియో, ఫోటోను షేర్ చేస్తూ విజ్ వర్మ.. కావాలా పాట హాట్ హాట్‌గా కేక పెట్టిస్తున్నది. సినిమా దేవుడితో కలిసి హాట్‌గా కనిపించింది అని కామెంట్ చేశారు. సోని పిక్చర్స్, అనిరుధ్, నెల్సన్‌కు విజయ్ వర్మ ట్యాగ్ చేశారు. ప్రస్తుతం విజయ్ వర్మ పోస్టుపై నెటిజన్లు భారీగా కామెంట్స్ చేస్తున్నారు.
తమన్నా, విజయ్ వర్మ డేటింగ్ వ్యవహారం జనవరి 2023లో మొదలైంది. వారిద్దరు చేస్తున్న వెకేషన్స్‌కు భారీ క్రేజ్ ఏర్పడింది. తమన్నా, విజయ్ నటించిన లస్ట్ స్టోరీస్ 2 ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రిమింగ్ అవుతున్నది. వారి నటించిన ఎపిసోడ్‌కు మంచి రెస్పాన్స్ క్రిటిక్స్ నుంచి వస్తున్నది. డేటింగ్, రిలేషన్‌షిప్ వ్యవహారం అందరిలోను ఆసక్తిని రేపింది.


Click it and Unblock the Notifications











