twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్సువల్ హరాస్మెంట్: షార్ట్ ఫిల్మ్‌తో తనుశ్రీ దత్తా మరో సంచలనం!

    |

    2018లో ఇండియాలో #మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి తనుశ్రీ దత్తా ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు దశాబ్దం క్రితం జరిగిన సంఘటనను తెరపైకి తెచ్చిన ఆమె ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ తన పట్ల షూటింగులో సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాన్ని బయటపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేశారు.

    అప్పటి వరకు బాలీవుడ్లో క్లీన్ ఇమేజ్ ఉన్న నానా పాటేకర్ ఒక్కసారిగా సమాజం దృష్టిలో దోషిగా నిలబడాల్సిన పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాడు. ఈ వివాదం నానా పాటేకర్ సినిమా కెరీర్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఈ వివాదం కారణంగా హౌస్‌ఫుల్ 4 నుంచి అర్దాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది.

    తనుశ్రీ దత్తా షార్ట్ ఫిల్మ్

    తనుశ్రీ దత్తా షార్ట్ ఫిల్మ్

    తనుశ్రీ దత్తా స్పూర్తితో ఎంతో మంది నటీమనులు, మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు ఎదురైన #మీటూ ఇన్సిడెంట్స్ బయట పెట్టారు. ఈ వ్యవహారాన్ని తనుశ్రీ అంత ఈజీగా వదలడం లేదు. ‘సెక్సువల్ హరాస్మెంట్' అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

    ‘ఇన్స్‌స్పిరేషన్’

    ‘ఇన్స్‌స్పిరేషన్’

    ‘ఇన్స్‌స్పిరేషన్' పేరుతో రూపొందుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. కొత్తగా సినిమా ఇండస్ట్రీ లేదా ఇతర రంగాల్లోకి ఎలాంటి మెంటర్, గాడ్ పాదర్ లేకుండా వచ్చే యువత ఎలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారు.

    గార్డియన్ ఏంజెల్

    ఈ షార్ట్ ఫిల్మ్‌లో తనుశ్రీ దత్తా... గార్డియన్ ఏంజెల్ అనే పాత్రలో కనిపించబోతోంది. ఆమె పాత్ర అమ్మాయిలు సరైన నిర్ణయాలు తీసుకునేలా ఆదర్శంగా ఉంటుందని టాక్. ఈ షార్ట్ ఫిల్మ్ కోసం తనుశ్రీ దత్తా కొన్ని డైలాగులు కూడా రాసిందట.

    తనుశ్రీ దత్తా జీవితంలో చేదు సంఘటన

    తనుశ్రీ దత్తా జీవితంలో చేదు సంఘటన

    2009లో ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓకే హార్న ప్లీస్' అనే చిత్రంలో నటిస్తుండగా నానా పాటేకర్ ఆమెను సెక్సువల్‌గా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం బయట పెట్టగా పెద్ద రచ్చయింది. తనుశ్రీ దత్తా ఎపిసోడ్‌తో ధైర్యం తెచ్చుకున్న ఇతర బాలీవుడ్ మహిళలు... సాజిద్ ఖాన్, అను మాలిక్, వికాస్ బెహల్, అలోక్ నాథ్ ఇలా పలువురు ప్రముఖుల వేధింపుల గురించి బయట పెట్టారు.

    English summary
    Tanushree Dutta will soon be bringing forth stories of sexual harassment in Bollywood on screen with her upcoming short film, Inspiration. The film will be released online on March 8 on the occasion of International Women’s Day, says a report in Mid Day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X