ఆడదానివై ఉండి ఇలాంటి పని చేస్తావా.. మహిళా దర్శకురాలిపై తనుశ్రీ ఆగ్రహం!

Recommended Video

ఆడదానివై ఉండి ఇలాంటి పని చేస్తావా..?

తనుశ్రీ దత్త.. ఇప్పుడు జాతీయ మీడియాని సైతం కుదిపేస్తున్న పేరు ఇది. బాలీవుడ్‌లో మీ టూ క్యాంపైన్‌కు తనుశ్రీ వ్యాఖ్యలు ఊపు తెచ్చాయి. తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి తనుశ్రీ దత్త ధైర్యంగా వెల్లడించింది. నానా పాటేకర్, వివేక్ అగ్నిహోత్రిపై ఆమె చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. దీనితో బాలీవుడ్ లో లైంగిక వేధింపుల చర్చ తెరపైకి వచ్చింది. తన వ్యాఖ్యలపై వేగంగా మారుతున్న పరిణామాలని తనుశ్రీ గమనిస్తోంది. నానా పాటేకర్ తనుశ్రీపై లీగల్ నోటీసులు పంపుతున్నట్లు తెలుస్తోంది.

నవ్వుతూ కనిపించిన నానా

నవ్వుతూ కనిపించిన నానా

తనుశ్రీ వ్యాఖ్యలతో నానా పాటేకర్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో వార్తలు వచ్చాయి. కానీ అతడు నవ్వుతూ, హాయిగా ఉన్నట్లు కనిపించాడు. ప్రముఖ బాలీవుడ్ మహిళా దర్శకురాలు ఫరా ఖాన్ నానా పాటేకర్ తో కలసి ఉన్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

సాటి మహిళగా

సాటి మహిళగా

నానా పాటేకర్ తో కలసి ఉండడం, అతడి ఫోటోనిసోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫరా ఖాన్ పై తనుశ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు ఎలాంటి మనిషో ఓ వైపు నేను చెబుతూనే ఉన్నాను. సాటి మహిళగా నా వేదనకు విలువ ఇచ్చి అండగా నిలబడాల్సింది పోయి అతడితో సంతోషంగా గడుపుతూ, పైగా ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటి అని తనుశ్రీ మండిపడింది.

 షూటింగ్ ఫినిష్ చేసుకుని

షూటింగ్ ఫినిష్ చేసుకుని

ప్రస్తుతం నానా పాటేకర్ హౌస్ ఫుల్ 4 చిత్రంలో నటిస్తున్నాడు. జైసల్మేర్ లో జరుగుతున్న షూటింగ్ ఫినిష్ కావడంతో చిత్ర యూనిట్ ముంబైకి బయలు దేరింది. ఈ సందర్భంగా నానా పాటేకర్ తో పాటు చిత్ర యూనిట్ తో దిగిన సెల్ఫీని ఫరా ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 తనుశ్రీకి లీగల్ నోటీసులు

తనుశ్రీకి లీగల్ నోటీసులు

తనుశ్రీ తనపై చేసినక్ తీవ్రమైన వ్యాఖ్యల నేపథ్యంలో నానా పాటేకర్ గుర్రుగా ఉన్నాడు. తన న్యాయవాదులతో కలసి ఆమెకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. తనుశ్రీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నానా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X