#మీటూ అలజడి రేపిన హీరోయిన్... ఇపుడు రిసార్టులో!
తనుశ్రీ దత్త పేరు కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా మీడియాలో మారుమ్రోగిపోతోంది. చాలా ఏళ్ల క్రితమే సినిమాలు మానేసిన ఈ బ్యూటీ కొంతకాలం పాటు ఎవరికీ కనిపించకుండా కనుమరుగైపోయింది. అమెరికాలో ఉండి ఇటీవలే ఇండియా తిరిగి వచ్చారు. రావడంతోనే బాలీవుడ్లో #మీటూ ఉద్యమం మొదలు పెట్టడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే.
పదేళ్ల క్రితం 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగులో జరిగిన ఓ సంగటన తెరపైకి తెచ్చి నానా పాటేకర్ మీద సెక్సువల్ మిస్‌కండక్ట్ ఆరోపణలు చేసి సంచలనం క్రియేట్ చేశారు. తనుశ్రీ ఇచ్చిన ధైర్యంలో పలువురు నటీమణులు, సింగర్స్ ముందుకు వచ్చి బాలీవుడ్లో మరికొందరి పేర్లు బయట పెట్టిన సంగతి తెలిసిందే.

రిసార్టులో దర్శనమిచ్చిన తనుశ్రీ దత్తా
నానా పాటేకర్ మీద ఆరోపణల తర్వాత తనుశ్రీ దత్తా వివాదాస్పద, టెన్షన్ పూరిత వాతావరణంలోనే నెట్టివేయ బడ్డారు. లీగల్‌గా ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఉన్నట్టుండి తనుశ్రీ దత్తా పూణె సమీపంలోని ఓ రిసార్టులో దర్శనమిచ్చారు.

రిలాక్స్ అయ్యేందుకే...
మీటూ వివాదాలు, కోర్టు కేసుల నేపథ్యంలో... ఈ టెన్షన్ పూరిత వాతావరణం నుంచి బయట పడేందుకు, రియలాక్స్ అయ్యేందుకే తనుశ్రీ దత్తా ‘ఆత్మంతన్ వెల్‌నెస్ రిసార్ట్'కు వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోల్లో ఆమె మెడిటేషన్ చేస్తూ కనిపించారు.

తనుశ్రీ దత్తా నెక్ట్స్ స్టెప్ ఏమిటంటే..
నానా పాటేకర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు, రాఖీ సావంత్ మీద పరువు నష్టం దావా వేసిన తనుశ్రీ తన లాయర్ నితిన్ సాత్పుతేతో కలిసి కోర్టులో పోరాడుతున్నారు. న్యాయ పోరాటంలో విజయం సాధించేందుకు అవసరమైన సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నారు.

మున్ముందు ఎలాంటి పరిణామాలు?
విదేశాల్లో మొదలైన #మీటూ ఉద్యమం ఇండియాలోకి చాలా కాలం క్రితమే ప్రవేశించినా.... తనుశ్రీ దత్తా రంగంలోకి దిగిన తర్వాత ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఇప్పటికే సాజిద్ ఖాన్, సుభాష్ ఘాయ్, వికాస్ బహెల్, అలోక్ నాథ్, అను మాలిక్ లాంటి ప్రముఖుల చీకటి కోణాలు ఈ ఉద్యమం మూలంగా బట్టబయలయ్యాయి. మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











