twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #మీటూ తొలి కేసుకు ఊహించని దెబ్బ: నానా పాటేకర్‌కు పోలీసుల క్లీన్ చిట్!

    |

    ఇండియాలో #మీటూ ఉద్యమం గతేడాది ఉవ్వెత్తున ఎగసి పడటానికి కారణమైన ప్రధానమైన వ్యక్తుల్లో నటి తనుశ్రీ దత్తా ఒకరు. 2008లో ఓ సినిమా షూటింగ్ సమయంలో నానా పాటేకర్ తనను వేధింపులకు గురి చేశాడని ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది. తనుశ్రీ దత్తాను స్పూర్తిగా తీసుకుని చాలా మంది ఇండస్ట్రీకి చెందిన మహిళలు తమకు ఎదురైన #మీటూ అనుభవాల గురించి బయట పెట్టారు.

    కేవలం ఆరోపణలు చేయడం మాత్రమే కాదు.. నానా పాటేకర్ మీద ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ కేసు విచారణ జరుపుతున్న పోలీసులు తాజాగా నానాకు క్లీన్ చిట్ ఇస్తూ కేసు క్లోజింగ్ రిపోర్ట్ తయారు చేయడం గమనార్హం. తనుశ్రీ దత్తా చేస్తున్న ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని పోలీసులు తమ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

    ఈ రిపోర్టును సవాల్ చేస్తానంటున్న తనుశ్రీ దత్తా

    ఈ రిపోర్టును సవాల్ చేస్తానంటున్న తనుశ్రీ దత్తా

    నానా పాటేకర్‌కు క్లీన్ చిట్ ఇస్తూ పోలీసులు తయారు చేసిన రిపోర్టుపై తనుశ్రీ దత్తా స్పందించారు. పోలీసులు విడుదల చేసిన ఈ పోర్టును తాను సవాల్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ రిపోర్టును లీగల్‌గా సవాల్ చేసే అవకాశం ఆమెకు ఉందని నిపుణులు అంటున్నారు.

    తనుశ్రీ దత్తా లాయర్ ఏమంటున్నారంటే

    తనుశ్రీ దత్తా లాయర్ ఏమంటున్నారంటే

    ఈ రిపోర్టుపై తనుశ్రీ దత్తా తరుపు న్యాయవాది స్పందించారు. ఈ క్లోజింగ్ రిపోర్టుపై తమ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ తీసుకోలేదని తెలిపారు. పోలీసులు ‘బి సమ్మరీ రిపోర్ట్' ఫైల్ చేశారా? ‘సి సమ్మరీ రిపోర్ట్' తయారు చేశారా? అనే విషయంలో క్లారిటీ లేదని తెలిపారు. మొదటి రిపోర్ట్ అర్థం అది ఫేక్ కేసు అని, రెండో రిపోర్ట్ అర్థం సరైన ఆధారాలు లేవు అనే అర్థం వస్తుందట.

    10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన

    10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన

    2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్' అనే సినిమా షూటింగ్ సమయంలో నానా పాటేకర్ తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య సహాయంతో తనకు నచ్చిన విధంగా అసభ్యంగా డాన్స్ స్టెప్పులు వేయించే ప్రయత్నం చేశాడని, తాను ఇబ్బందిగా ఫీలవుతున్నా వినకుండా వేధింపులకు గురి చేశాడని ఆమె ఆరోపించారు.

    నానా పాటేకర్

    నానా పాటేకర్

    నానా పాటేకర్ ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నాడని, వారిని బెదిరిస్తూ కేసు నీరుగారేలా చేస్తున్నారని గతంలో తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇండియాలో #మీటూ ఉద్యమానికి ఆద్యురాలిగా ఇప్పటి వరకు తనుశ్రీ దత్తా వార్తల్లో ఉన్నారు. లాంటి వ్యక్తి కేసు నిలబడే పరిస్థితి లేక పోవడం చర్చనీయాంశం అయింది. నానా పాటేకర్ మీద ఆరోపణలు రుజువు కాలేదు కాబట్టి బాలీవుడ్లో అతడిపై విధించిన ఆంక్షలు కూడా సడలించే అవకాశం ఉంది.

    English summary
    Nana Patekar, who was accused of sexual harassment by Tanushree Dutta on sets of a film, gets clean chit from police. According to Times Now, Mumbai police has made a closure report on the case stating that there is no evidence available to back up Tanushree's allegations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X