పెద్దాయన ఆమెని బాగా ఎంకరేజ్ చేశారు.. అదేం తప్పు కాదు.. హీరోయిన్‌పై దర్శకుడి సంచలన కామెంట్స్!

ఆషిక్ బనాయా అపనే చిత్రంలో శృంగార హొయలు ఒలికించిన తనుశ్రీ దత్త ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. డాన్స్ మూమెంట్స్ పేరుతో ఓ నటుడు తనని లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్త సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అతడి పేరు చెప్పడానికి తనుశ్రీ ఇష్టపడలేదు. తాజగా దిగ్గజ నటుడు నానా పటేకరే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బయటకు చెప్పేసింది. తనుశ్రీ వ్యాఖ్యలతో బాలీవుడ్ లో అగ్గి రాజేసుకుంది. నానా పాటేకర్ మద్దత్తు దారులు తనుశ్రీ పై విరుచుకుపడుతున్నారు.

 డాన్స్ మూమెంట్స్

డాన్స్ మూమెంట్స్

2009 లో విడుదలైన హార్న్ ఒకే ప్లీజ్ అనే చిత్రంలో తనుశ్రీ దత్త ఐటెం సాంగ్ లో నర్తించింది. ఆ సాంగ్ చిత్రీకరణ సందర్భంగా నానా పాటేకర్ తనని లైంగికంగా వేధించాడని తనుశ్రీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. డాన్స్ తాను సరిగా చేయడం లేదు అని వంకతో, సెక్సీ స్టెప్పులు నేర్పిస్తానని చెప్పి బలవంతంగా చేతులతో బంధించాడు.

 సెట్‌లో అందరిని

సెట్‌లో అందరిని

ఆ సమయంలో సెట్ లో ఉన్న అందరిని కొరియోగ్రాఫర్స్ తో సహా బయటకు పంపాడు. తీవ్రంగా లైంగిక వేధింపులకు గురిచేశాడు. దర్శకుడికి, నిర్మాతకు ఫిర్యాదు చేసినా వారు నా మాటకు కనీస గౌరవం ఇవ్వలేదు అని తనుశ్రీ వాపోయింది. తనుశ్రీకి కొంతమంది నుంచి మద్దత్తు లభిస్తున్నా ఆ చిత్ర యూనిట్ మాత్రం యూనిట్ మాత్రం ఆమెనే తప్పు బడుతున్నారు.

 ఒకరితరువాత ఒకరు

ఒకరితరువాత ఒకరు

తనుశ్రీ వ్యాఖ్యలని ఆ చిత్రానికి కొరియోగ్రాఫర్ గా పనిచేసిన గణేష్ ఆచార్య నిన్ననే ఖండించాడు. తాజగా చిత్ర దర్శకుడు రాకేష్ సారంగ్ స్పందించాడు. తనుశ్రీ దత్తదే తప్పు అన్నట్లుగా మాట్లాడాడు. నానా పాటేకర్ చాలా పెద్దవారు. సెట్ లో అందరిని ఆయన ప్రోత్సహిస్తారు అని రాకేష్ సారంగ్ అభిప్రాయ పడ్డారు.

తప్పుగా అర్థం చేసుకుంది

తప్పుగా అర్థం చేసుకుంది

నానా పాటేకర్ ప్రోత్సాహాన్ని ఆమె తప్పుగా అర్థం చేసుకుని అనవసరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోందని సారంగ్ మండిపడ్డాడు. తనుశ్రీ, నానా పాటేకర్ వ్యవహారం బాలీవుడ్ లో పెద్ద దుమారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వివాదాన్ని ఇంతటితో విడిచిపెట్టి ఆమె ముందుకు సాగాలని దర్శకుడు తెలిపాడు.

 కాంట్రవర్సీ అందుకే

కాంట్రవర్సీ అందుకే

తనుశ్రీ దత్తా మళ్ళీ బాలీవుడ్ చిత్రాలలో నటించాలని అనుకుంటోంది. ఆమెని అంతా మరచిపోయారు. అందుకే కాట్రవర్సీ సృష్టించి పబ్లిసిటి పొందే ప్రయత్నం చేస్తోందని సారంగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

400 మంది మధ్యలో

400 మంది మధ్యలో

అది సోలో సాంగ్ అని, అక్కడ మగవారికి ఏం పని అని తనుశ్రీ చెబుతోంది. ఆ సాంగ్ లో మగవారి వాయిస్ కుండా ఉంది కదా అని సారంగ్ అభిప్రాయ పడ్డారు. మీ బాస్ ఎవరైనా మిమ్మల్ని వేధించాలి అని అనుకుంటే తన క్యాబిన్ లోకి పిలుస్తాడు. పబ్లిక్ గా ఎవరూ వేధించరు. కానీ ఆసమయంలో సెట్ లో 400 మంది ఉన్నారని సారంగ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X