తనుశ్రీ దత్తా, నానా పాటేకర్ కేసు: పోలీసుల ముందు మరో హీరోయిన్ వాంగ్మూలం
తనుశ్రీ దత్తా, నానా పాటేకర్ కేసు విచారణ వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ కేసులో బాలీవుడ్ నటి డైసీ షా వాంగ్మూలం సైతం పోలీసులు రికార్డు చేశారు. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగ్ సమయంలో నానా పాటేకర్ తనను వేధించినట్లు తనుశ్రీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
మీటూ ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్లో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో నానా పాటేకర్ వేధింపుల విషయం బయట పెట్టిన తనుశ్రీ దత్తా... కొన్ని రోజుల తర్వాత ముంబైలోని ఓషివరా పోలీస్ స్టేషన్లో అతడిపూ కంప్లయింట్ చేశారు. సాంగ్ షూటింగ్ సమయంలో తనతో వల్గర్ స్టెప్పులు వేయించేందుకు నానా పాటేకర్ ఇబ్బంది పెట్టాడని, అతడి మాట వినక పోవడంతో గుండాలతో తన కారుపై దాడి చేయించారని తనుశ్రీ దత్తా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' షూటింగ్ సమయంలో సెట్స్‌లో డైసీ షా వాగ్మూలం పోలీసులు రికార్డ్ చేశారు. ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తున్న డైసీ షా పదేళ్ల క్రితం గణేష్ ఆచార్య వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. ఆ సమయంలో ఆమె తనుశ్రీ దత్తాకు డాన్స్ స్టెప్స్ ఎలా వేయాలో నేర్పించారట.
పోలీసుల ఆదేశాల మేరకు డైసీ షా తన టీమ్‌తో కలిసి ఓషివరా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆ రోజు సెట్స్‌లో ఏం జరిగిందనే విషయం పోలీసులకు వివరించారు. వివిధ అంశాలపై ప్రశ్నిస్తూ దాదాపు 3 గంటల పాటు ఆమె వాంగ్మూలం పోలీసులు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











