లెజెండరీ యాక్టర్‌పై బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు లైంగిక వేధింపులు.. ఇప్పుడు మరోలా కామెంట్

సినీ రంగానికి సంబంధించి ఎన్నో అంశాలు హైలైట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో జరిగే కాంట్రవర్శీలు దేశ వ్యాప్తంగా సెన్సేషన్‌గా మారుతుంటాయి. అలా కొన్నేళ్ల నుంచి హాట్ టాపిక్ అవుతోన్న విషయాల్లో ప్రముఖ నటి తనుశ్రీ దత్తా, నానా పటేకర్ ఇష్యూ ఒకటి. ఓ సినిమా షూటింగ్ సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సదరు హీరోయిన్ కామెంట్స్ చేయడం అప్పట్లో సంచలనం అయింది. ఆ తర్వాత అతడికి ఈ విషయంలో క్లీన్ చిట్ కూడా వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ ఈ వివాదం రాజుకుంది. అసలేం జరిగిందో మీరే చూడండి!

మీటూ ఉద్యమంతో షాక్
2018లో ఓ సినిమాలో స్పెషల్ సాంగ్‌ను చేస్తున్న సమయంలో తనతో నానా పటేకర్ అనుచితంగా ప్రవర్తించాడని తనుశ్రీ దత్తా ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయింది. దీని తర్వాతనే మీటూ ఉద్యమం తెరపైకి వచ్చింది. ఆ సమయంలోనే తనుశ్రీ దత్తాకు పెద్ద ఎత్తున మద్దతు కూడా లభించడంతో ఇది పెద్ద వివాదంగా మారింది.

Tanushree Dutta Once Again Reacted About on Nana Patekar Comments

నానా పటేకర్‌కు క్లీన్ చిట్
తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో నానా పటేకర్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. ఆ సమయంలో అతడిపై విచారణ జరిపేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అలా సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ ఇష్యూలో నానా పటేకర్‌కు క్లీన్ చిట్ లభించింది. దీంతో ఈ ఇష్యూకు పుల్‌స్టాప్ పడిపోయింది. మధ్యలో కొన్నిసార్లు ఇది తెరపైకి వచ్చినా అంతగా ప్రభావాన్ని చూపలేకపోయింది.

Tanushree Dutta Once Again Reacted About on Nana Patekar Comments

నానా పటేకర్ మరోసారి
గతంలో జరిగిన వివాదం ముగిసినా పలుమార్లు ఈ అంశాన్ని ఎవరో ఒకరు లేవనెత్తుతూనే వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవలే నానా పటేకర్ ఓ ఇంటర్వ్యూలో దీనిపై మళ్లీ స్పందించారు. 'తనుశ్రీ చెప్పనట్లుగా అక్కడేమీ జరగలేదు. ఆ సమయంలో 50 మంది సెట్‌లో ఉన్నారు. ఏదైనా జరిగి ఉంటే వాళ్లు కచ్చితంగా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవారు' అని చెప్పుకొచ్చారు.

Tanushree Dutta Once Again Reacted About on Nana Patekar Comments

స్పందించిన హీరోయిన్
నానా పటేకర్ ఇటీవలే చేసిన వ్యాఖ్యలపై తనుశ్రీ దత్తా స్పందించింది. ఈ మేరకు ఆమె ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 'నానా పటేకర్ చేసిన కామెంట్లు అబద్దం కాబట్టి నాకు ఎలాంటి కోపం రాలేదు. అతడికి దేశ వ్యాప్తంగా మద్దతు తగ్గిపోతుంది. ఫాలోయింగ్ డౌన్ అవుతోంది. అందుకే నానా ఇలా అబద్దాలకోరులా మాట్లాడుతున్నాడు' అని చెప్పింది.

Tanushree Dutta Once Again Reacted About on Nana Patekar Comments

చెప్పుతో కొట్టాడు అంటూ
తనుశ్రీ దత్తా కంటిన్యూ చేస్తూ.. 'నానా పటేకర్ ఎంత అబద్దాలకోరో అనిల్ శర్మ షూటింగ్ ఇష్యూతో బయటపడింది. అప్పుడు షూటింగ్‌లో ఓ బాలుడిని చెప్పుతో కొట్టి.. తర్వాత ఏమీ తెలియనట్టుగా మాట్లాడాడు. అప్పుడే అతడి గురించి ప్రపంచానికి తెలిసిపోయింది. అతడు అప్పుడు క్షమాపణ చెప్పడంతో దొరికిపోయాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు' అని వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X