అతడొక రేపిస్ట్, సినిమా నుంచి తొలగించండి.. స్టార్ హీరోపై మండిపడ్డ హీరోయిన్!
గత ఏడాది మీటూ ఉద్యమం బాలీవుడ్ ని కుదిపేసింది. సీనియర్ హీరోయిన్ తనుశ్రీ దత్త ప్రముఖ నటుడు నానా పాటేకర్ పై చేసిన లైంగిక వేధింపుల సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలతోనే బాలీవుడ్ లో మీటూ ఉద్యమం మొదలైంది. తనుశ్రీ దత్తా ఇచ్చిన ధైర్యంతో చాలా మంది నటీమణులు తమకు ఎదురైన వేధింపులని వివరిస్తూ పలువురు దర్శకులు, నిర్మాతలు, నటుల పేర్లు బయట పెట్టారు. మీటూ ఉద్యమ ప్రభావంతో చాలా మంది దర్శకులు, నటులు సినిమాలు కోల్పోవలసి వచ్చింది. తాజాగా తనుశ్రీ దత్తా మరోసారి చెలరేగిపోయింది. స్టార్ హీరోయిన్ అజేయ దేవగన్ పై తనుశ్రీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

అతడొక రేపిస్ట్
గత ఏడాది తనుశ్రీ దత్తా మీటూ ఉద్యమం ప్రారంభించిన తర్వాత చాలా మంది హీరోయిన్లు, మహిళా ఆర్టిస్టులు బహిరంగంగా తమకు ఎదురైన వేధింపులని బయటకు చెప్పారు. ఈ క్రమంలో చాలా మంది దర్శకులు, నటుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో ప్రముఖ రచయిత్రి వింటా నందా నటుడు అలోక్ నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనని అతడు రేప్ చేశాడు అంటూ వింటా నందా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

రేపిస్ట్‌కు ఛాన్స్ ఇస్తారా
అలోక్ నాథ్ ప్రస్తుతం అజయ్ దేవగన్ 'దే దే ప్యార్ దే' చిత్రంలో నటిస్తున్నాడు. ఒక రేపిస్ట్ కు అవకాశం ఇవ్వడం ఏంటని తనుశ్రీ దత్తా అజయ్ దేవగన్ పై విరుచుకుపడ్డారు. బాలీవుడ్ లో అందరూ అబద్దాలు చెప్పేవారే. అందుకు ఉదాహరణ అజయ్ దేవగన్. అలోక్ నాథ్ పై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేసి ఉంది. ఆ విషయం తెలిసి కూడా తడికి అజయ్ దేవగన్ ఎందుకు అవకాశం ఇచ్చారు అని తనుశ్రీ దత్తా ప్రశ్నించారు.

తొలగించాలి
అలోక్ నాథ్ లాంటి వ్యక్తిని ప్రోత్సహించడం సరైంది కాదు. అతడిని మీ చిత్రం నుంచి తొలగించి మరో నటుడిని తీసుకోండి అని తనుశ్రీ దత్త అజయ్ దేవగన్ కు సూచించింది. అలా చేయకుంటే అజయ్ దేవగన్ తప్పుని ప్రోత్సహించే వ్యక్తి అని భావించాల్సి ఉంటుంది అని తనుశ్రీ దత్తా హెచ్చరించింది. ఒక రేపిస్ట్ కు మద్దతు ఇవ్వడం అజయ్ దేవగన్ కు మంచిది కాదు అని తనుశ్రీ దత్త పేర్కొంది.

కేసు నమోదు
అలోక్ నాథ్ పై అత్యాచార ఆరోపణలు చేసిన తర్వాత వింటా నందా అతడిపై కేసు నమోదు చేసింది. మరికొందరు నటీమణులు కూడా అలోక్ నాథ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తికి అజయ్ దేవగన్ దే దే ప్యార్ దే చిత్రంలో అవకాశం ఇచ్చారని తనుశ్రీ మండిపడుతోంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన టబు, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం మే 17న విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











