ఆమె రక్తం మొత్తం డ్రగ్సే.. 4 గంటలు మత్తులోనే.. రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు!
బాలీవుడ్ లో మీటూ ఉద్యమ సెగలు కొనసాగుతూనే ఉన్నాయి. తనుశ్రీ దత్త ప్రముఖ నటుడు నానా పాటేకర్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనుశ్రీ ఆరోపణలతో మీటూ ఉద్యమం ప్రారంభమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో చాలా మంది నటీమణులు ధైర్యంగా ముందుకు వచ్చి మీటూ ఉద్యమంలో పాల్గొంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమకు జరిగిన లైంగిక వేధింపుల ఘటనలని వివరిస్తూ ప్రముఖుల బండారం బయట పెడుతున్నారు. ఈ వ్యవహారంలో శృంగారతార రాఖీ సావంత్, తనుశ్రీ దత్త మధ్య వివాదం నెలకొంది.

హార్న్ ఒకే ప్లీజ్ చిత్రంలో
హార్న్ ఒకే ప్లీజ్ చిత్ర షూటింగ్ సమయంలో తనని నానా పాటేకర్ లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్త ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నానా పాటేకర్ వేధింపుల వలనే తాను ఆ చిత్రం నుంచి తప్పుకున్నానని తనుశ్రీ దత్త తెలిపింది. తనుశ్రీ వ్యాఖ్యలపై మొదట భిన్నమైన స్పందన వచ్చినా క్రమంగా ఆమెకు మద్దత్తు పెరిగింది.

డ్రస్ అలవాటు
తనుశ్రీ దత్త ఆ చిత్రం నుంచి తప్పుకున్న తరువాత రాఖీ సావంత్ ని తీసుకున్నారు.నానా పాటేకర్ పై తనుశ్రీ చేసిన వ్యాఖ్యలని రాఖీ సావంత్ ఖండించింది . పబ్లిసిటీ కోసమే తనుశ్రీ అసత్య ఆరోపణలు చేస్తోందని తెలిపింది. తనుశ్రీ దత్తకు డ్రస్ తీసుకునే అలవాటు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆమె రక్తం మొత్తం మత్తు మందులే
షూటింగ్ సమయంలో తనుశ్రీ దత్త డ్రగ్స్ తీసుకుని నాలుగు గంటల పాటు మత్తులోనే ఉండిపోయింది. అందుకే ఆమె స్థానంలో సాంగ్ షూటింగ్ కోసం నన్ను తీసుకున్నారు. తనుశ్రీ రక్తం మొత్తం ఎప్పుడూ మత్తుమందులే ఉంటాయి అంటూ రాఖీ సావంత్ తనుశ్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇండియా విడిచి వెళ్ళిపోతా
కేవలం పబ్లిసిటి కోసమే తనుశ్రీ నానా పాటేకర్ లాంటి గొప్ప నటుడిపై నిందలు వేస్తోంది. లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపణలు చేస్తే సరిపోదు. ఆధారాలు చూపించాలి. తనుశ్రీ ఆధారాలు చూపిస్తే తాను ఇండియా విడిచి వెళ్లిపోతానని రాఖి సావంత్ సవాల్ చేసింది.

10 కోట్ల పరువునష్టం దావా
రాఖీ సావంత్ వ్యాఖ్యలకు తనుశ్రీ దత్త ధీటుగా కౌంటర్ ఇచ్చింది. రాఖీ సావంత్ పై 10 కోట్ల పరువునష్టం దావా వేసింది. రాఖీ సావంత్ సమాధానం చెప్పకపోతే రెండేళ్ల పాటు ఆమెకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తనుశ్రీ తరుపున న్యాయవాది పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











