twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ షార్ట్ ఫిల్మ్‌కు మీటూ ఉద్యమానికి సంబంధం లేదు: తనుశ్రీ దత్తా

    |

    'మీటూ' ఉద్యమం ఇండియాలో ఉవ్వెత్తున్న ఎగసిపడటానికి ప్రధాన కారణం తనుశ్రీ దత్తా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమెను స్పూర్తిగా తీసుకుని చాలా మంది నటీమనులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు ఎదురైన మీటూ సంఘటనల గురించి వెల్లడించారు.

    చాలా కాలం క్రితమే నటనకు దూరమైన తెరమరుగైన తనుశ్రీ దత్తా గతేడాది మీటూ ఉద్యమంతో మళ్లీ తెరపైకి వచ్చారు. 'ఇన్స్‌స్పిరేషన్' అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా నటనలో తన సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ తిరిగి నటన వైపు రావడంపై స్పందించారు.

    ఇది నా కథ కాదు, నేను రాసిన కథ అసలే కాదు

    ఇది నా కథ కాదు, నేను రాసిన కథ అసలే కాదు

    ఈ షార్ట్ ఫిల్మ్ బాలీవుడ్లో మీటూ మూమెంట్ గురించి కాదని, ఏ ఇతర రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ గురించి కాదని తనుశ్రీ దత్తా స్పష్టం చేశారు. అలాగే నాకు ఎదురైన మీటూ సంఘటనల ఆధారంగా ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ రాశాను అనే దాంట్లో కూడా నిజం లేదు. ఇది నేను రాసిన కథ కాదు. ఆన్ లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ ఫ్లాట్ పాం ‘ఉల్లు' వారు దీన్ని రూపొందించారని తెలిపారు.

    ‘ఇన్స్‌స్పిరేషన్'

    ‘ఇన్స్‌స్పిరేషన్'

    కొత్తగా సినిమా ఇండస్ట్రీ లేదా ఇతర రంగాల్లోకి ఎలాంటి మెంటర్, గాడ్ పాదర్ లేకుండా వచ్చే యువత ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ ‘ఇన్స్‌స్పిరేషన్' షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారు.ఈ షార్ట్ ఫిల్మ్‌లో తనుశ్రీ దత్తా... గార్డియన్ ఏంజెల్ అనే పాత్రలో నటించింది.

    #మీటూ ఉద్యమం ఉవ్వెత్తున

    #మీటూ ఉద్యమం ఉవ్వెత్తున


    2018లో ఇండియాలో #మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి తనుశ్రీ దత్తా ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు దశాబ్దం క్రితం జరిగిన సంఘటనను తెరపైకి తెచ్చిన ఆమె ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ తన పట్ల షూటింగ్ సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాన్ని బయటపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పటి వరకు బాలీవుడ్లో క్లీన్ ఇమేజ్ ఉన్న నానా పాటేకర్ ఒక్కసారిగా సమాజం దృష్టిలో దోషిగా నిలబడాల్సిన పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాడు. ఈ వివాదం నానా పాటేకర్ సినిమా కెరీర్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపింది. హౌస్‌ఫుల్ 4 నుంచి అర్దాంతరంగా తప్పుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

    తనుశ్రీ దత్తా బాటలో

    తనుశ్రీ దత్తా బాటలో

    తనుశ్రీ దత్తా ఎపిసోడ్‌తో ధైర్యం తెచ్చుకున్న ఇతర బాలీవుడ్ మహిళలు... సాజిద్ ఖాన్, అను మాలిక్, వికాస్ బెహల్, అలోక్ నాథ్ ఇలా పలువురు ప్రముఖుల వేధింపుల గురించి బయట పెట్టడంతో మీటూ ఉద్యమం బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకంపణలు క్రియేట్ చేసింది.

    English summary
    In an interview to a leading daily, Tanushree Dutta talked about her comeback with short film."It is also not written by me. It is inspirational and motivational content where I have spoken from my own insight and journey into Bollywood to help newcomers navigate the tricky waters and avoid exploitation. It is on the online streaming content platform ULLU."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X