తాప్సీ కోసం దిగుతున్న టాలెంటెడ్ హీరో....
దమ్మున్న పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన తాప్సీ, బాలీవుడ్ పాగా వేసేసిందనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే దక్షిణాదినా అమ్మడికి అలాంటి ఆఫర్లే వెల్లువెత్తుతున్నాయి. ఇటీవేలే తమిళంలో తాప్సీ లీడ్ రోల్ లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మేకప్ లేకుండా అచ్చమైన గిరిజన అమ్మాయిగా దర్శనమిచ్చిన తాప్సీ, ఈ సారి భారీగానే కొట్టబోతోందని అర్ధమవుతోంది. అయితే, అమ్మడికి తోడు ఇప్పుడు మరో హీరో జత కలిశాడట.
పాత్ర ప్రాముఖ్యాన్ని బట్టీ కథలను ఎంపిక చేసుకునే టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం ఉప్పెన సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తాప్సీ లీడ్ రోల్ చేస్తున్న తమిళ సినిమాలోనూ సేతుపతి ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నాడట.

కొత్త దర్శకుడు దీపక్ సౌందర రాజన్ కథకు ఫిదా అయిపోయిన తాప్సీ చాలాకాలం తరువాత దక్షిణాదిన ఈ సినిమా అంగీకరించింది. ఇక పాత్ర నిడివి కన్నా దానికి ఉన్న ఇంపార్టెన్స్ ను బట్టీ ఈ సినిమాలో ఓ అతిథి పాత్ర చేసేందుకు విజయ్ సేతుపతి అంగీకరించినట్లు తెలుస్తోంది. సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాప్సీ, విజయ్ సేతుపతి పాత్రలే హైలైట్ గా నిలవబోతున్నాయట. ఇక తాప్సీని అత్యంత శక్తివంతమైన మహిళగా చూపించబోతున్నారని తెలుస్తోంది. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏవిధంగా అలరిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











