హిందీ అర్జున్ రెడ్డికి హీరోయిన్ దొరికింది.. ఎవరో తెలుసా!
గత ఏడాది టాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అవుతోంది. డెబ్యూ దర్శకుడు సందీప్ వంగ దర్శత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం విజయం సాధించింది. ఈ చిత్రంలో ఉన్న బోల్డ్ కంటెంట్ యువతకు విపరీతంగా నచ్చడంతో కలెక్షన్ల వర్షం కురిపించింది. హిందీ రీమేక్ లో స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు.
షాహిద్ కపూర్ కు తాజగా హీరోయిన్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. యంగ్ బ్యూటీ తార సుతారియాని ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తార సుతారియా ప్రస్తుతం తన డెబ్యూ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో నటిస్తోంది.


అర్జున్ రెడ్డి చిత్రంతో మరో క్రేజీ ఆఫర్ ని ఈ భామ దక్కించుకుంది. టివి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తార సురతారియా ఇప్పుడిప్పుడే బిగ్ స్క్రీన్ పై అవకాశాలు దక్కించుకుంటోంది. సందీప్ వంగ హిందీ రీమేక్ ని కూడా తెరకెక్కిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











