బాలీవుడ్ అర్జున్ రెడ్డికి జోడి కుదిరింది.. టీవీ భామతో రొమాన్స్!
నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అర్జున్ రెడ్డి చిత్రం జాతీయ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. బోల్డ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ చిత్రం కొన్ని విషయాలలో వివాదం సృష్టించినప్పటికీ.. ఆ అంశాలు విజయానికి మాత్రం అడ్డు కాలేకపోయాయి.
ఈ చిత్ర రీమేక్ హక్కుల పలు భాషల నుంచి నిర్మాతలు పోటీ పడ్డారు. తెలుగులో విజయ్ దేవర కొండా, షాలిని పాండే జంటగా నటించారు. తమిళంలో ఈ చిత్రం వర్మగా రీమేక్ అవుతోంది. స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్నాడు. తన కుమారుడికి ఇదే సరైన లాంచింగ్ మూవీ అని విక్రమ్ భావించాడు.

ఇక బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం రీమేక్ అవుతోంది. స్టార్ హీరో షాహిద్ కపూర్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డే దర్శకత్వం వహించనున్నాడు. జూన్ నుంచి ప్రారంభం కానున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఓ టీవీ నటిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. టివి నటిగా గుర్తింపు పొందిన తార సుతారియా ఈ చిత్రంలో నటించనుండడం విశేషం. తార సుతారియా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో అవకాశం దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











