Don't Miss!
- News ఏపీలో మోడీ ప్రచారం ఖరారు-4 బహిరంగ సభలకు ప్లాన్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
RX 100 కోసం సింగర్‌గా మారిన యంగ్ హీరోయిన్
హిందీ RX 100 సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్దమవుతున్నది. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి డెహ్రాడూన్, ముస్సోరిలో ప్రారంభం కానున్నది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ హీరో సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హీరోయిన్ తారా సుతారియా హీరోయిన్గా నటిస్తున్నది. ఈ సినిమాలో ఆమె మరో పాత్రను కూడా పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తారా సుతారియా గాయనిగా కూడా మారనున్నారు.
తారా సుతారియాను గాయనిగా మార్చాలన్నది దర్శకుడు మిలన్ లుథ్రియాది. తనకు ఆలోచనను నిర్మాత సాజిద్ నడియావాలాతో చెప్పడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ విషయాన్ని తారా సుతారియాకు చెప్పడంతో గాయనిగా మారేందుకు ఎగిరి గంతేసినట్టు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అలియా భట్, పరిణితి చోప్రా, ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్ తదితరులు గాయనీ గాయకులుగా మారారు. యువ హీరోయిన్ తారా సుతారియా కూడా సింగర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమవుతున్నారు.
హీరో కార్తీకేయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ నటించిన RX 100 చిత్రం తెలుగులో ఘన విజయం సాధించింది. హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులను దక్కించుకొన్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, తారా సుతారియా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన నటిస్తున్నది. గతంలో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాకు ఇది సీక్వెల్.