twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RX 100 కోసం సింగర్‌గా మారిన యంగ్ హీరోయిన్

    |

    హిందీ RX 100 సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్దమవుతున్నది. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి డెహ్రాడూన్, ముస్సోరిలో ప్రారంభం కానున్నది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ హీరో సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హీరోయిన్ తారా సుతారియా హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమాలో ఆమె మరో పాత్రను కూడా పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తారా సుతారియా గాయనిగా కూడా మారనున్నారు.

    తారా సుతారియాను గాయనిగా మార్చాలన్నది దర్శకుడు మిలన్ లుథ్రియాది. తనకు ఆలోచనను నిర్మాత సాజిద్ నడియావాలాతో చెప్పడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ విషయాన్ని తారా సుతారియాకు చెప్పడంతో గాయనిగా మారేందుకు ఎగిరి గంతేసినట్టు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

    ఇప్పటికే బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అలియా భట్, పరిణితి చోప్రా, ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్ తదితరులు గాయనీ గాయకులుగా మారారు. యువ హీరోయిన్ తారా సుతారియా కూడా సింగర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమవుతున్నారు.

    Tara Sutaria Turns as singer for RX 100

    హీరో కార్తీకేయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ నటించిన RX 100 చిత్రం తెలుగులో ఘన విజయం సాధించింది. హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులను దక్కించుకొన్నట్టు సమాచారం.

    ఇదిలా ఉండగా, తారా సుతారియా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన నటిస్తున్నది. గతంలో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాకు ఇది సీక్వెల్.

    English summary
    Tara Sutaria Turns as singer for RX 100. The source adds, “Sajid discussed the idea with his director Milan Luthria. When they informed Tara, she happily agreed. She is a trained vocalist and wants to cut an album in the near future.” .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X