twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఫీషియల్: ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ ఖరారు, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే...

    |

    భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా తెరకెక్కబోతున్న బయోపిక్ గురించి అఫీషియల్ ప్రకటన వచ్చేసంది. ఇందులో మోడీ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పోషించబోతున్నారు. ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని సందీప్ సింగ్ నిర్మించబోతున్నారు.

    ఇండియన్ సినీ పరిశ్రమలో బయోపిక్ చిత్రాల పరంపర కొనసాగుతోంది. ఎన్టీ రామరావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మన్మోహన్ సింగ్, రాజ్ థాకరే..... బయోపిక్స్ తర్వాత ఇపుడు ప్రధాన మంత్రి జీవితంపై కూడా సినిమా వస్తుండటం చర్చనీయాంశం అయింది.

    ఆయన ఎందుకు తప్పుకున్నారో?

    ఆయన ఎందుకు తప్పుకున్నారో?

    వాస్తవానికి నాలుగేళ్ల క్రితమే నరేంద్ర మోడీ బయోపిక్ అనౌన్స్ చేశారు. మోడీ పాత్ర పరేష్ రావల్‌తో చేయించాలనుకున్నారు. కారణం ఏమిటో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నారు. ఇపుడు వివేక్ ఒబెరాయ్‌తో ఆ పాత్ర చేయించేందుకు ఒప్పించారు.

    అఫీషియల్ ప్రకటన, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే...

    ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. వివేక్ ఒబెరాయ్ హీరోగా ఓమంగ్ కుమార్ దర్శకత్వంలో సందీప్ సింగ్ నిర్మాతగా నరేంద్ర మోడీ బయోపిక్ రాబోతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ జనవరి 7న ఆవిష్కరిస్తారు. సంక్రాంతి తర్వాత నుంచి షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.

    ఇందులో ఏం చూపిస్తారు?

    ఇందులో ఏం చూపిస్తారు?

    మెడీ బాల్యం, ఛాయ్ వాలా స్థాయి నుంచి ప్రధాన మంత్రిగా ఎదిగిన క్రమం.... రాజకీయాల వైపు ఎలా వచ్చారు? గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆపై దేశ ప్రధానిగా ఎన్నిక కావడం వెనక పరిణామాలు ఏమిటి? లాంటి ముఖ్యమైన విషయాలు ఈ చిత్రంలో చూపిస్తారని తెలుస్తోంది.

    పొలిటికల్ కోణం?

    పొలిటికల్ కోణం?

    మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోడీ బయోపిక్ హాట్ టాపిక్ అయింది. ఈ బయోపిక్ తెరకెక్కించడం వెనక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

    English summary
    Bollywood actor Vivek Oberoi is set to play the role of Narendra Modi in his biopic titled PM Narendra Modi. Taran Adarsh confirmed the news and tweeted, "IT'S OFFICIAL... Vivekanand Oberoi [Vivek Oberoi] to star in Narendra Modi biopic, titled #PMNarendraModi... Directed by Omung Kumar... Produced by Sandip Ssingh... First look poster will be launched on 7 Jan 2019... Filming starts mid-Jan 2019."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X