‘సాహో’పై బాలీవుడ్లో దారుణమైన రివ్యూలు... ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' మూవీ భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైంది. ఇండియన్ సినీ చరిత్రలో తెరకెక్కిన హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రాల్లో ఇదీ ఒకటి. రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 2.0 తర్వాత స్థానంలో ఉంది.
'సాహో' చిత్రాన్ని ఇంత భారీ ఖర్చుతో తెరకెక్కించడానికి కారణం ప్యాన్ ఇండియా లెవల్లో సినిమాను తీసుకొచ్చే ప్రయత్నం చేయడమే. అందుకే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదని ప్రభాస్, దర్శక నిర్మాతలు ముందు నుంచీ చెబుతున్నమాట.

ఆ ధైర్యంతోనే భారీగా ఖర్చు పెట్టారు
ఇండియా వైడ్ చూసుకుంటే ప్రధాన మైన మార్కెట్ బాలీవుడ్. బాలీవుడ్ ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించాలనే కారణంతోనే.... హీరోయిన్‌తో పాటు ప్రధాన తారాగణం మొత్తం కూడా హిందీ చిత్ర సీమ నుంచే ఎంపిక చేశారు. నార్త్ ఇండియా ప్రేక్షకులకు సినిమా కొంచెం నచ్చినా గట్టేక్కేయవచ్చు అనే ఒక ధైర్యంతోనే ఇంత భారీగా బడ్జెట్ కుమ్మరించారు.
బాలీవుడ్లో దారుణమైన రివ్యూలు
ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు, క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ‘సాహో' చిత్రానికి దారుణమైన రేటింగ్ ఇచ్చారు. 1.5/5 రేటింగ్ ఇచ్చిన ఆయన భరించలేని విధంగా సినిమా ఉందని వ్యాఖ్యానించారు. టాలెంట్, డబ్బు, అవకాశం అన్నీ వ్యర్థం అయ్యాయి. బలహీనమైన కథ, గందరగోళంగా ఉన్న స్క్రీన్ ప్లే, మెచ్యూరిటీ లేని డైరెక్షన్ అంటూ.... విమర్శలు గుప్పించారు.

తరణ్ ఆదర్శ్ రివ్యూ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతోందా?
హిందీలో మంచి పాపులారిటీ కలిగిన క్రిటిక్స్, విశ్లేషకుల్లో తరణ్ ఆదర్శ్ ఒకరు. ఆయన చేసిన ట్వీట్ వల్ల ‘సాహో' మూవీపై తీవ్రమైన ప్రభావం పడే అవాకాశం ఉందని అంటున్నారు. మౌత్ టాక్ కూడా అంత గొప్పగా ఏమీ లేకపోవడం కూడా ‘సాహో'కు ప్రతికూల అంశం.

తెలుగులో పరిస్థితి
హిందీతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో సాహో పరిస్థితి కాస్త బెటర్ అని చెప్పొచ్చు. లోకల్ స్టార్ కావడం, ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అయితే ఇక్కడ పాజిటివ్‍తో పాటు నెగెటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయితే ఈ మూవీ హిట్టా? ఫట్టా? అనేది తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











