వారికి అండగా బాద్‌షా.. షారుఖ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ప్రపంచ దేశాలన్నింటిని పట్టి పీడిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 23 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు లక్షకుపైగా దుర్మరణం చెందారు. మనదేశంలోనూ కరోనా ప్రభావం రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. ఇప్పటికే మనదేశంలో పదిహేను వేల మంది కరోనా బారిన పడ్డారు. అందులో దాదాపు ఆరు వందల మంది మరణించారు.
కరోనా వైరస్ తన ప్రభావాన్ని పెంచుకుంటూనే పోతోంది. ఈ వైరస్ కట్టడికి భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. ఇలాంటి కష్టసమయంలో ఆదుకునేందుకు ఎంతోమంది తారలు ముందుకు వచ్చారు.ఈ మేరకు షారుఖ్.. తన ఆధ్వర్యంలో ఉన్న రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, మీర్ ఫౌండేషన్, రెడ్ చిల్లీస్ వీఎఫ్‌ఎక్స్ సంస్థలతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తరుపున పలు సహాయక కార్యక్రమాలు చేయనున్నట్టు వెల్లడించారు. ముంబైలో ఉన్న తన సొంత కార్యాలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా వాడుకోవడానికి ఇచ్చేశాడు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో.. తమ ప్రాణాలను పణంగా పెట్టి ముందున్న వైద్య బృందానికి సాయపడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నినాదానికి షారుక్ మద్దతుతెలిపాడు. ఒకే ప్రపంపచం అందరం కలిసి ఇంట్లోనే ఉందామని ఇచ్చిన పిలుపుకు షారుక్ తన సంఘీభావాన్ని తెలిపాడు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ షారుక్‌పై ప్రశంసలు కురిపించింది. ఇలాంటి కష్టకాలంలో తమకు, తమ సంస్థ తరుపున నిలబడినందుకు ధన్యవాదాలు అని తెలిపింది. మన మంతా కలిసి ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచుదామని పిలుపునిచ్చింది.


Click it and Unblock the Notifications











