ప్రముఖ టీవీ నటి కన్నుమూత.. మరణంపై రూమర్లు.. ఖండించిన సహా నటుడు
బుల్లితెరపై తన నటనతో ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకొన్న లీనా ఆచార్య ఇకలేరు. సేథి జీ, ఆప్ కే ఆ జానే సే, మేరి హనిమారక్ బీవీ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకొన్న లీనా శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోనే తన నివాసంలో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
లీనా ఆచార్య కొద్ది నెలలుగా కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఆమెను అనారోగ్యం తీవ్రంగా వేధించింది. కిడ్నీ సమస్య తీవ్రతరం కావడంతో ఈ లోకం నుంచి వెళ్లిపోయారు అని నటుడు వర్షిప్ ఖన్నా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు.

అయితే ఆమె కరోనా వ్యాధితో మరణించారనే రూమర్లు రావడంతో వర్షిప్ ఖన్నా ఖండించారు. ఆమె మరణానికి కారణం కిడ్ని ఫెయిల్యూర్ అని స్పష్టం చేశారు. తనతో కలిసి నటించడం గొప్ప అవకాశం. సేథి జీ సీరియల్‌లో ఆమె నాకు అమ్మగా నటించారు.
ఇక లీనా ఆచార్య విషయానికి వస్తే.. ఆమె వయసు 30 సంవత్సరాలు. పలు టెలివిజన్ సీరియల్స్‌తోపాటు బాలీవుడ్ చిత్రాల్లోను, అలాగే వెబ్ సీరీస్‌లో నటించారు. ఆమె నటించిన చివరి చిత్రం హిచికి. ఈ చిత్రంలో రాణి ముఖర్జితో కలిసి నటించారు.


Click it and Unblock the Notifications











