For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రేప్ కేసులో టెలివిజన్ నటుడు అరెస్ట్.. నిజం కాదు నాన్సెన్స్ అంటూ టాలీవుడ్ నటి మద్దతు!

  |

  బాలీవుడ్ కి చెందిన నటులు ఈ మధ్య కాలంలో వరుసగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు హిందీ టెలివిజన్ రంగంలో ప్రముఖ నటుడు నాగిని త్రీ ఫేం పర్ల్ వీ పూరీ మీద రేప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే.. రేప్ కేసు నమోదు కావడంతో పోలీసులు అతనిని అరెస్టు కూడా చేశారు. ఈ అంశం హిందీ టీవీ పరిశ్రమలో కలకలం రేపింది.. అయితే అతనికి అండగా టాలీవుడ్ నటి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  మైనర్ బాలిక రేప్

  మైనర్ బాలిక రేప్


  ఒక మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పర్ల్ వీ పూరీని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఒక మైనర్ బాలిక తనను పర్ల్ వీ పూరీ సహా మరో ఐదుగురు అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. కదులుతున్న కారులోనే తన మీద పదే పదే అత్యాచారానికి పాల్పడినట్లుగా బాలిక ఫిర్యాదు చేయగా అందులో పర్ల్ వీ పూరీ కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ అంశం మీద పోలీసులు ఐదుగురుతో పాటు వారిని కూడా అరెస్టు చేశారు.

  నాగిన్ 3తో ఫేం

  నాగిన్ 3తో ఫేం


  అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో పర్ల్ వీ పూరీని విచారిస్తున్నట్లు సమాచారం. రేప్ కేసు మాత్రమే కాక పోస్కో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. 2019లో దిల్ కీ నజర్ సే ఖూబ్ సూరత్ అనే సీరియల్‌తో హిందీ వినోదరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఫిర్ బీ నా మానే, బత్తమీజ్ దిల్ సీరియల్‌తో పాపులారిటీని సంపాదించారు. నాగిన్ 3, నాగార్జున ఏక్ యోధ, బేపనా ప్యార్ సీరియల్స్‌తో మరింత పాపులర్ అయి ప్రస్తుతం బ్రహ్మరాక్షస్ 2 టీవీ సీరియల్‌లో నటిస్తున్నారు.

  అంతా నాన్సెన్స్

  అంతా నాన్సెన్స్

  అయితే ఇదంతా పక్కన పెడితే ఆయన అరెస్ట్ కు సంబంధించి నటి అనిత కీలక వ్యాఖ్యలు చేసింది. నిజానికి పూరి అరెస్టయిన వెంటనే ఐస్టాండ్ విత్ పూరీ పేరుతో హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక తెలుగులో కూడా పాపులర్ అయిన అనిత ఆయనకు మద్దతుగా మాట్లాడుతూ ఈ వార్త అంతా నాన్సెన్స్ అన్నట్లు కొట్టిపారేసింది. ఇప్పుడు జరిగిన ప్రచారం అంతా నిజం కాదని త్వరలోనే అసలైన నిజాలు బయటకు వస్తాయని ఆమె చెప్పుకొచ్చింది. ఈ భామ తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను, నువ్వు నేను, నిన్నే ఇష్టపడ్డాను లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

  టెలివిజన్ రంగం కూడా సపోర్ట్ గా

  టెలివిజన్ రంగం కూడా సపోర్ట్ గా

  సోషల్ మీడియానే కాకుండా నటుడికి హిందీ టెలివిజన్ రంగం కూడా సపోర్ట్ గా నిలబడింది. అనిత మాత్రమే కాక చాలామంది నటీనటులు ఆయనకు సపోర్ట్ తెలుపుతున్నారు. అయితే ఇది పోస్కో యాక్ట్ కూడా కావడంతో ఆయనకు బెయిల్ కూడా లభించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయన బెయిల్ మీద బయటకు వస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది.

  Recommended Video

  Anita Hassanandani, Rohit Reddy Blessed With A Baby Boy
  మొన్న కూడా మరో రేప్ కేసు

  మొన్న కూడా మరో రేప్ కేసు

  ఇక కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ కు చెందిన ఒక మాజీ మోడల్ ఏకంగా తొమ్మిది మంది మీద రేప్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా టాలీవుడ్ కి చెందిన ఇద్దరు నిర్మాతల పేర్లు బయటకు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ రేప్ కేసు మరుగున పడిపోయింది తాజా రేప్ కేసులో మాత్రం ఏకంగా ఒక టెలివిజన్ నటుడు అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది అని చెప్పక తప్పదు.

  English summary
  Mumbai police arrested actor Pearl V Puri after the victim, 17-year-old, along with her mother complained against the actor. actress Anita Hassanandani, who is also a known face in Tollywood, lent support to Pearl V Puri calling the news as ‘nonsensical’.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X